నాణెం: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: విస్తరణ
పంక్తి 3:
===భారతదేశంలో===
క్రీ.పూ 1000 సంవత్సరం నుంచి భారతదేశంలో నాణేలు చెలామణిలో ఉన్నాయని కన్నింగ్‌హామ్ అభిప్రాయం. జె.క్రిబ్ అనే మరో పురావస్తు శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం ఇక్కడ క్రీ.పూ 350 సంవత్సరం కంటే ముందే నాణేలను వినియోగించారు. మనదేశంలో క్రీస్తుపూర్వం 6-7 శతాబ్దాలలో, లేదా అంతకంటే కొంచెం ముందు నాణేలు తయారై ఉండవచ్చునని ''పి ఎల్ గుప్తా''తో పాటు, అధిక సంఖ్యలో చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు. ఇంత వివాదానికి కారణం తొలినాటి నాణేల మీద పాలకుల వివరాలు లేవు. నాణేలు తమ సంగతి తాము చెప్పలేనపుడు వాటి ఆచూకీ తెలుసుకోవడానికి ఉపయోగపడేవి సాహిత్య, పురావస్తు ఆధారాలే. క్రీ.శ ఒకటవ శతాబ్దానికి చెందినట్టు భావించే [[పాణిని]] తన [[అష్టాధ్యాయి]] గ్రంధంలో నాణేల ప్రస్తావన తెచ్చాడు. క్రీస్తుశకం నాల్గవ శతాబ్దం వాడైన [[కౌటిల్యుడు]] [[అర్థశాస్త్రం]]లో దొంగనాణేలను గురించి, సీసం గనుల గురించి ప్రస్తావించాడు. కాబట్టి దేశంలో పంచ్‌మార్క్‌డ్ నాణేలు నాల్గవ శతాబ్దానికే చెలామణీలో ఉన్నట్టే. లేదంటే కొంచెం ముందు నుంచి ఉండవచ్చు. ఇది అందరూ అంగీకరిస్తున్న చారిత్రక సత్యం.అయితే ఎవరు విడుదల చేశారో చెప్పడానికి ఆధారాలు లేవు. మన కృష్ణాజిల్లా సింగవరంలో లభ్యమైన వెండి నాణేల పరిస్థితి కూడా ఇదే.<ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/naaNela_charitra.htm</ref>
==ఇతర దేశాల్లో==
భారత్ వలెనే ఎంతో పురాతన చరిత్ర కలిగిన దేశాలు[[ గ్రీస్]], [[చైనా]], [[రోమ్]], మొదలైనవి. గ్రీకులు, చైనీయులు క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్ధంలో నాణేలు విడుదల చేసుకున్నారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. రోమన్లు, పర్షియన్లు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో నాణేలను చెలామణీలోకి తెచ్చారని కూడ నిర్దిష్టమైన ఆధారాలు ఉణ్ణాయి. అయితే భారతదేశ నాణేల చరిత్రకు ఇలాంటి విస్పష్టమైన ఆధారలేమీ లేవు. ఇక్కడ నాణేలు ఎప్పటి నుంచి చెలామణీ అవుతున్నాయనే సంగతి ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలి ఉంది.
 
==హాబీ==
వివిధ కాలాలకు చెందిన వివిధ రకాలైన నాణేలను సేకరించడం కొంతమందికి హాబీ.
"https://te.wikipedia.org/wiki/నాణెం" నుండి వెలికితీశారు