చమరీ మృగం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ug:قوتاز
చి యంత్రము కలుపుతున్నది: br:Yak; cosmetic changes
పంక్తి 17:
}}
 
'''చమరీ మృగం''' లేదా '''జడల బర్రె''' ([[ఆంగ్లం]]: '''Yak''') పొడవైన వెంట్రుకలు కలిగిన [[క్షీరదాలు]]. వీటి శాస్త్రీయ నామం [[బాస్ గ్రునియెన్స్ ]] (Bos grunniens). ఇవి [[దక్షిణాసియా]] హిమాలయ పర్వత ప్రాంతాలలో, [[టిబెట్]] నుండి [[మంగోలియా]] వరకు విస్తరించాయి. హిందూ దేవతల పూజా కార్యక్రమాలలో ఉపయోగించే [[చామరం]] దీని వెంట్రుకలతో తయారుచేస్తారు.
 
 
== జీవనశైలి ==
ఇవి ఎక్కువగా పెంపుడు జంతువులుగా జీవిస్తాయి. కొద్ది జీవులు అడవులలో ఉంటాయి.
 
పంక్తి 27:
చమరీ మృగాలు సుమారు సెప్టెంబర్ మాసంలో జతకడతాయి. ఆడజీవులు ఇంచుమించు 3–4 సంవత్సరాల వయసులో మొదలుపెట్టి ఏప్రిల్-జూన్ నెలల్లో దూడల్ని కంటాయి. వీటి గర్భావధి కాలం సుమారు 9 నెలలు. దూడలు సంవత్సర కాలం తల్లివద్ద పాలు త్రాగి, తర్వాత స్వతంత్రంగా 20 సంవత్సరాలు పైగా జీవిస్తాయి.
 
== పెంపుడు జంతువు ==
[[Imageఫైలు:Woman with yak at Qinghai Lake.jpg|thumb|250px|షింగై సరస్సు వద్ద చమరీమృగంతో ఒక స్త్రీ]]
చమరీ మృగాల్ని వాటినుండి లభించే [[పాలు]], [[ఉన్ని]] మరియు [[మాంసం]] కోసం పెంచుతారు. వీటిని బరువైన పనులు చేయడానికి కూడా ఉపయోగించుకుంటారు. స్థానిక రైతులు, వర్తకులు వీటిని వస్తువులను ఎత్తైన పర్వతాల గుండా రవాణా చేయటానికి ఉపయోగిస్తారు. పర్వతారోహణ, సాహసిక బృందాలు వీటిని తమ సామగ్రిని చేరవేయటానికి కూడా ఉపయోగిస్తాయి. వీటిని నాగలి కట్టి పొలాలు దున్నటానికి కూడా ఉపయోగిస్తారు. చమరీ మృగాల పేడను ఆవుపేడ వలె పిడకలు చేసి వంటచెరుకుగా, ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. చమరీమృగాల పాలనుండి ''చ్ఛుర్పీ'' (టిబెటన్, నేపాలీ భాషలు) లేదా బ్యాస్లాగ్ (మంగోలియన్) అనే ఒక రకం చీజ్ ను తయారుచేస్తారు. ఈ పాల నుండి తీసిన వెన్నను, టీలో కలిపి చేసిన బటర్ టీ ని టిబెట్ ప్రజలు విరివిగా తాగుతారు.<ref>[http://www.flavorandfortune.com/dataaccess/article.php?ID=205 Tibet and Tibetan Foods]</ref> ఈ వెన్నను దీపాలు వెలిగించటానికి, మత సంబంధ ఉత్సవాలలో ఉపయోగించే వెన్న శిల్పాలను సృష్టించడానికి కూడా ఉపయోగిస్తారు.<ref>[http://www.webexhibits.org/butter/countries-tibet.html Yaks, butter & lamps in Tibet], webexhibits.org</ref>
 
పంక్తి 35:
చమరీమృగాలనుండి లభించే పోగులు మృదువుగా, నునువుగా ఉండి, బూడిద, గోధుమ, నలుపు మరియు తెలుపు మొదలైన అనేక వర్ణఛ్ఛాయలలో లభ్యమౌతాయి. 1.2 అంగుళాల పొడవుండే ఈ పోగులను మృగాల నుండి దువ్వడం లేదా విదిలించిండం ద్వారా సేకరిస్తారు. ఇలా లభ్యమైన పోగులను యేకటం ద్వారా తయారైన మొత్తని తంత్రులను వడికి ఉన్ని దారాన్ని తయారు చేస్తారు. ఈ దారాన్ని అనేక ఉన్నివస్త్రాలను అల్లటానికి ఉపయోగిస్తారు. చమరీమృగాల వెంట్రుకల నుండి తాళ్ళు, రగ్గులు మరియు అనేక ఇతర సామగ్రి తయారు చేస్తారు. ఈ జంతువుల తోలుతో బూట్లు, చేతిసంచుల తయారితో పాటు చిన్న పడవ నిర్మాణంలో కూడా ఉపయోగిస్తారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== గ్యాలరీ ==
<gallery>
Image:Yaks in Manali.jpg|మనాలీలో పగ్గాలు వేసి సవారీ చేయటానికి అనువుగా తీర్చిన చమరీమృగాలు
పంక్తి 46:
</gallery>
 
== బయటి లింకులు ==
*http://www.iucnredlist.org/search/details.php/2892/summ
*ARKive - [http://www.arkive.org/species/GES/mammals/Bos_grunniens/ images and movies of the wild yak ''(Bos grunniens)'']
పంక్తి 62:
[[bg:Як]]
[[bo:གཡག་]]
[[br:Yak]]
[[ca:Iac]]
[[cs:Jak divoký]]
"https://te.wikipedia.org/wiki/చమరీ_మృగం" నుండి వెలికితీశారు