దామోదరం సంజీవయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
సంజీవయ్యకు విద్యార్ధిగా ఉన్న రోజుల్లో రాజకీయాలపై, స్వాతంత్ర్యోద్యమముపై ఏమాత్రము ఆసక్తి చూపలేదు. కానీ లా అప్రెంటిసు చేస్తున్న సమయములో వివిధ రాజకీయనాయకుల పరిచయము మరియు సాంగత్యము వలన రాజకీయాలలో ప్రవేశించాలనే ఆసక్తి కలిగినది.
 
1950 జనవరి 26న రాజ్యాంగము అములులోకిఅమలులోకి రావడముతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్ పార్లమెంట్ గా అవతరించినది. అయితే ప్రొవిజనల్ పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభలలో రెండిట్లో సభ్యత్వము ఉన్న సభ్యులు ఏదొ ఒకే సభ్యత్వముని ఎన్నుకోవలసి వచ్చినది. షెడ్యూల్డ్ కులమునకు చెందిన ఎస్.నాగప్ప అలా తన శాసనసభ సభ్యత్వము అట్టిపెట్టుకొని ప్రొవిజనల్ పార్లమెంటుకు రాజీనామా చేయడముతో ఆ స్థానమును పూరించడానికి [[బెజవాడ గోపాలరెడ్డి]], ఆంధ్ర రాష్ట్ర కాంగ్రేసు కమిటీ తరఫున సంజీవయ్యను ఎంపిక చేశాడు. ఎన్నికలు జరిగి తొలి విధానసభ ప్రమాణస్వీకారము చేయడముతో 1952 మే 13 న ప్రొవిజనల్ పార్లమెంటు రద్దయినది.
 
టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గములో ఆరోగ్యశాఖా మంత్రిగా ఉండగానే సికింద్రాబాదులో పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కృష్ణవేణి ని సంజీవయ్య [[1954]], [[మే 7]] న పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానము లేదు. సుజాత అను ఒక బాలికను దత్తత తీసుకున్నారు.
 
[[1967]]లో ఎన్నికల ప్రచార సమయములో [[విజయవాడ]] నుండి హైదరాబాదుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా ఎన్నటికి కోలుకోలేకపోయాడు. [[1972]] [[మే 7]] వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతములో [[ఢిల్లీ]]లో గుండెపోటుతో మరణించాడు. ఆయన అంత్యక్రియలు [[మే 9]]వ తేదీన [[సికింద్రాబాదు]]లోని పాటిగడ్డలో అధికార లాంచనాలతోలాంఛనాలతో జరిగినవి. ఆయన స్మారకార్ధం పాటిగడ్డ సమీపమున ఒక ఉద్యానవనమును పెంచి ఆయన పేరుమీదుగా ''సంజీవయ్య పార్కు'' అని పేరు పెట్టారు.
 
==నిర్వహించిన పదవులు==
"https://te.wikipedia.org/wiki/దామోదరం_సంజీవయ్య" నుండి వెలికితీశారు