"అభిమన్యుడు" కూర్పుల మధ్య తేడాలు

31 bytes added ,  11 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: ml:അഭിമന്യു; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: hi:अभिमन्यु (अर्जुनपुत्र))
చి (యంత్రము కలుపుతున్నది: ml:അഭിമന്യു; cosmetic changes)
 
 
అభిమన్యుడు పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. వివాహానంతరము అభిమన్యుడు, అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో [[భీష్ముడు|భీష్ముని]]చే రచించబడిన [[పద్మవ్యూహము]]లో ప్రవేశించి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన [[దుర్యోధనుడు|దుర్యోదన]], [[దుశ్శాసనుడు|దుశ్శాసన]], [[కర్ణుడు|కర్ణాదు]]లచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కథ [[మహాభారతము|భారతము]]లో దాదాపు ముగుస్తుంది. అభిమన్యుని మరణము అర్జునునికి తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది. సుభద్ర పుత్రశోకంతో అభిమన్యుని మరణాన్ని నివారించలేదని [[కృష్ణుడు|కృష్ణుని]] నిలదీస్తుంది. అభిమన్యుని మరణసమయంలో అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉండటము వలన ఆమె సహగమనము నివారించబడినది. యుద్ధానంతరము ఉపపాండవులను [[అశ్వద్ధామ]] సంహరించడము వలన అభిమన్యుని పుత్రుని వలననే పాండవ వంశము వృద్ధి చెందినది. దుర్యోధనుని సోదరి భర్త [[సైంధవుడు]], అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించిన తరవాత అర్జునుని మినహా మిగిలిన పాండవులను అడ్డగించాడని, ఆ కారణంగానే అభిమన్యుడు యుద్ధములో మరణించాడని క్రోధుడైన అర్జునుడు ప్రతినచేసి సైంధవుని సంహరించి తన పుత్రశోకాన్ని ఒకింత తగ్గించుకుంటాడు. అందువలన సైంధవుని మరణానికి అభిమన్యుడు కారణమౌతాడు. అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహములో ఎలాప్రవేశించాలని వివరించినపుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వినడం గ్రహించిన కృష్ణుడు అర్జునుని నివారించి పద్మవ్యూహం నుండి బయటికి రావడం చెప్పకుండా చేశాడు. ఆకారణంగా పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు పద్మవ్యూహంనుండి బయట పడలేక వీరమరణం చెందినట్లు మహాభారత కథనం వివరిస్తుంది.
 
[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]
[[kn:ಅಭಿಮನ್ಯು]]
[[ta:அபிமன்யு]]
[[ml:അഭിമന്യു]]
[[de:Abhimanyu]]
[[gu:અભિમન્યુ]]
20,823

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/443039" నుండి వెలికితీశారు