అయ్యగారి సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

+మూలాలు
పంక్తి 1:
'''ఎ.యస్.రావు'''గా ప్రసిద్ధుడైన '''అయ్యగారి సాంబశివరావు''' [[భారతదేశం|భారతదేశ]] అణు శాస్త్రవేత్త. [[హైదరాబాదు]]లోని ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు<ref>[http://www.ecil.co.in/HISTORY.htm History of Electronics Corporation of India Ltd]</ref><ref name=ASRAC>[http://www.drasrac.org/drasrao.htm Dr A. S. Rao (1914-2003)]</ref> మరియు [[పద్మ భూషణ్]] పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి [[ఎ.యస్.రావు నగర్]] గా నామకరణం చేశారు.
 
ఎ.యస్.రావు [[సెప్టెంబర్ 20]], [[1914]]న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[మోగల్లు]]లో జన్మించాడు. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము]] నుండి విజ్ఞానశాస్త్రములో మాస్టరు డిగ్రీ అందుకొని అక్కడే అధ్యాపకునిగా ఆరు సంవత్సరాల పాటు పరిశోధనలు చేశాడు. 1946లో సాంబశివరావు [[స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము]]లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో మాస్టరు డిగ్రీ చేయటానికి ప్రతిష్ఠాత్మక టాటా స్కారలుషిప్పుతో ఎన్నికైనాడు. 1947లో స్టాన్‌ఫర్డ్ నుండి ఇంజనీరింగు పట్టాపుచ్చుకొని భారతదేశము తిరిగివచ్చిన తర్వాత భారతదేశ అణుశక్తి విభాగములో అణు శాస్త్రవేత్తగా చేరాడు. అక్కడ [[హోమీ బాబా]] వంటి ప్రముఖులతో కలసి పనిచేశాడు. ఈయన [[2003]], [[అక్టోబర్ 31]]న మరణించాడు.