హిల్డా మేరీ లాజరస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''హెచ్.ఎం.లాజరస్''' లేదా '''హిల్డా మేరీ లాజరస్''' ([[ఆంగ్లం]]: Hilda Mary Lazarus) (1890 - 1978) ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు. వీరు [[జనవరి 23]], [[1890]] సంవత్సరంలో [[విశాఖపట్టణం]]లో జన్మించారు.
 
1906లో మెట్రిక్యులేషన్ పరీక్ష పాసై 1911లో బి.ఎ. పట్టభద్రులయ్యారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1916లో ఎం.బి.బి.ఎస్. చదివారు. 1917లో లండన్ చేరిన అనంతరం విద్యాభ్యాసం కొనసాగించారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంచే స్త్రీల వైద్యసేవల నిమిత్తం భారతదేశంలో తొలి వైద్యురాలిగా నియమితులయ్యారు. ప్రసూతి విభాగంలో సహాయకురాలిగా తొలి రెండు నెలలు పనిచేశారు. తరువాత కలకత్తాలోని డఫెరిన్ ఆసుపత్రికి బదిలీ అయ్యారు. అక్కడ 13 నెలలు ఆర్.ఎం.ఒ.గా సేవలందించి సూరత్ వెళ్ళారు. మూడున్నరేళ్ళ తరువాత విశాఖ డఫెరిన్ వైద్యాలయంలో చేరారు. విశాఖలో ప్రసూతి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి తెలుగులో బోధనకు అంకురార్పణ చేశారు. అలా విశాఖలో ఐదేళ్ళు, చెన్నైలో పన్నెండేళ్ళు, లేడీ హార్డింగ్ కళాశాల ప్రధానోపాధ్యాయినిగా మూడున్నరేళ్ళు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు.
పంక్తి 11:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎం.ఎల్.సి., జిల్లా పరిషత్ సభ్యురాలిగా అవిరళ సేవలందించారు.
 
భారత ప్రభుత్వం ఈమెను '[[పద్మశ్రీ']] అవార్డుతో గౌరవించింది.
 
ఈమె [[జనవరి 23]], [[1978]] సంవత్సరంలో పరమపదించారు.
పంక్తి 19:
[[వర్గం:1890 జననాలు]]
[[వర్గం:1978 మరణాలు]]
 
[[en:Hilda Mary Lazarus]]
"https://te.wikipedia.org/wiki/హిల్డా_మేరీ_లాజరస్" నుండి వెలికితీశారు