వికీపీడియా:శైలి: కూర్పుల మధ్య తేడాలు

→‎భాష: భాషా సవరణలు
→‎భాష: +వ్యావహారిక శైలి, +అనుస్వారాలు
పంక్తి 15:
==భాష==
'''మందార మకరంద మాధుర్యమును బోలు''' అన్న తెలుగు వాక్యాన్ని అనుసరించి, మీకు తెలిసినంతలో చక్కటి తెలుగు పదాలతో వ్యాసం రాయండి. మాట్లాడే శైలి కాకుండా రాసే శైలిని అవలంబించండి.
 
;వ్యావహారిక భాషలో రాయండి.
:సరళ గ్రాంథికంలో రాయవద్దు. ఉదాహరణకు.. "వెళ్ళుచుండెను" "వెళ్ళుచున్నాడు" "వెళ్తున్నాడు" వంటి క్రియాప్రయోగాలు భాషలో ఉన్నాయి. మొదటి రెండు ప్రయోగాలు గతకాలపు రచనల్లో కనిపిస్తాయిగానీ, ఇప్పటి రచనల్లో వాడుకలో లేదు. వికీపీడియా వ్యాసాల్లో కూడా అలాంటి ప్రయోగాలు ఉండకూడదు.
 
;''ము'', ''అనుస్వారాల'' (సున్నా) వాడుకలో వికీపీడియా విధానం
:''ము'' తో అంతమయ్యే పదాల విషయంలో ము స్థానంలో అనుస్వారం వాడుకలోకి వచ్చింది. ''ప్రపంచము'', ''అంధకారము'', అనికాక ''ప్రపంచం'', ''అంధకారం'' అని రాస్తూంటాం. వికీపీడియాలో కూడా అదే విధానాన్ని అవలంబించాలి. అలాగే అనుస్వారంతో అంతమయ్యే పదాలకు బహువచనాలు రాయడంలో అనుస్వారం లుప్తమైపోయి, దాని ముందరి అక్షరం దీర్ఘమై చివర్లో లు చేరుతుంది. ''విధానం'' అనే పదం యొక్క బహువచనరూపం ''విధానాలు'' అవుతుంది.
 
==వ్యక్తుల పేర్లు==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:శైలి" నుండి వెలికితీశారు