మొసలికంటి తిరుమలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మొసలికంటి తిరుమలరావు''' (1901 - 1970) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు పార్లమెంటు సభ్యులు. వీరు తూర్పు గోదావరి జిల్లా [[పిఠాపురం]]లో శాయన్న పంతులు దంపతులకు జన్మించారు.
 
వీరు 1921 లో [[మహాత్మా గాంధీ]] పిలుపు నందుకొని కాలేజీ చదువులకు వదలి [[సహాయ నిరాకరణ ఉద్యమం]]లో పాల్గొన్నారు. 1930లో [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొన్నందుకు ఏడాది కఠినశిక్ష విధించారు. రాజమండ్రి, చెన్నై, వెల్లూరు జైల్లలో ఆ శిక్ష అనుభవించారు. 1931లో శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని మరొక ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు. వీరు 1940 వ్యక్తి సత్యాగ్రహంలోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని కఠిన శిక్షలను అనుభవించారు.
 
వీరు తూర్పు గోదావరి కాంగ్రెసు అధ్యక్షలుగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. 1937 నుండి 1940 వరకు కేంద్ర అసెంబ్లీ సభ్యులుగాను, 1945-1947 లో స్టేట్ కౌన్సిల్ సభ్యులుగాను, 1948-1950 లలో రాజ్యాంగ సభ సభ్యులుగాను, 1950-1952లో తాత్కాలిక గవర్నమెంటు సభ్యులుగా ఉన్నారు.
 
వీరు 1957, 1962, 1967 సాధారణ ఎన్నికలలో [[లోకసభ]]కు ఎన్నికై కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ ఉపమంత్రిగా పనిచేశారు.
 
వీరు 1970 సంవత్సరంలో పరమపదించారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]