సుడోకు: కూర్పుల మధ్య తేడాలు

వర్గీకరణ
చి యంత్రము కలుపుతున్నది: tl:Sudoku; cosmetic changes
పంక్తి 1:
[[బొమ్మఫైలు:Sudoku-by-L2G-20050714.svg|thumb|right|250px|ఒక సుడోకు ప్రహేళిక...]]
[[బొమ్మఫైలు:Sudoku-by-L2G-20050714 solution.svg|right|thumb|250px|... దాని పరిష్కారం ఎర్ర రంగు అంకెలు అత్యుత్తమ పరిష్కారం)]]
'''''సుడోకు''''' ఒక తర్క-భరితమైన, గళ్ళలో [[అంకెలు]] నింపే ప్రహేళిక. ఈ ప్రహేళికలో ఒక 9x9 గళ్ళ చతురస్రము ఉంటుంది. అందులో మళ్ళీ తొమ్మిది 3x3 చతురస్రాలు ఉంటాయి. ఈ గళ్ళలో 1 నుండి 9 వరకు నింపాలి. చిన్న చతురస్రం (3x3)లో కాని పెద్ద చతురస్రం(9x9)లో అడ్డు ‍ మరియు‍ నిలువు వరుసలలో ఒకసారి ఉపయోగించిన అంకెలు మరోసారి ఉపయోగించరాదు. ఈ ప్రశ్నా ప్రహేళికలో అక్కడక్కడా కొన్ని అంకెలు నింపబడి ఉంటాయి. పూర్తయిన ప్రహేళిక ఒక రకమైన [[:en:Latin_square|లాటిన్ చతురస్రము]] పోలి ఉంటుంది. [[లియొనార్డ్ ఆయిలర్]] అభివృద్ది చేసిన ఈ లాటిన్ చతురస్రాల నుండి ఈ ప్రహేళిక పుట్టింది అంటారు కానీ, ఈ ప్రహేళికను కనుగొన్నది మాత్రము [[అమెరికా]]కు చెందిన [[:en:Howard_Garns|హావర్డ్ గార్నస్]]. ఈ ప్రహేళిక 1979లో డెల్ మ్యాగజిన్ లో ''నంబర్ ప్లేస్''<ref>{{cite web
|url=http://www.maa.org/editorial/mathgames/mathgames_09_05_05.html
|title=సుడోకు రకాలు}}</ref> మొదటి సారి ప్రచురితమైనది. 1986లో నికోలాయి దీనిని ''సుడోకు'' అనే పేరుతో ప్రాచుర్యానికి తీసుకొచ్చాడు. 2005లో సుడోకు అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించింది.
 
== పరిచయము ==
సుడోకు, "''సూజీ వ డొకుషిన్ ని కగీరూ''" అనే పెద్ద [[జపనీసు భాష|జపనీసు]] వాక్యానికి సంక్షిప్త నామము. అనగా జపనీసు భాషలో "ఒక్కొక్క అంకె ఒక్కొక్క సారి మాత్రమే రావలెను"<ref>{{cite web
|url=http://www.sudoku-tips.com/about_sudoku.php
పంక్తి 19:
|url=http://www.saidwhat.co.uk/sudokus/sudokufaq.php
|title=సుడోకు --సాధారణ ప్రశ్నలు
|accessdate=2006-10-06}}</ref>. సుడోకు [[జపాన్]] కు చెందిన ప్రహేళికా ప్రచురణకర్త అయిన [[http://en.wikipedia.org/wiki/Nikoli నికోలాయి]] కో లిమిటెడ్ కు ట్రేడ్ మార్క్ కూడా.<ref name=trademark>{{cite web | url = http://www.nikoli.co.jp/en/puzzles/sudoku/index_text.htm | title = నికోలాయి చరిత్రలో సుడోకు చరిత్ర | accessmonthday = సెప్టెంబరు 24 | accessyear = 2006 | author = నికోలాయి | work = అధికారిక నికోలాయి వెబ్‌సైటు}}</ref> సుడోకు ప్రహేళికలో అంకెలు ఒక సౌలభ్యము మాత్రమే. అంకెలే కాకుండా ఇతర చిహ్నాలు కూడా వాడుకోవచ్చు. (ఉదా:- రంగులు, వివిధ రూపాలు/ఆకారాలు, అక్షరాలు, బేస్ బాల్ గుర్తులు వంటి వాటిని నియమాలు మార్చకుండా అంకెలకు బదులు వాడుకోవచ్చును)
 
సుడోకు ప్రహేళికలో అత్యంత ఆకర్షణీయ అంశం నియమాలు చాలా సరళముగా ఉండటం. కానీ, పరిష్కారము కనుక్కోవడానికి వాడే తర్కపు సరళి మాత్రము చాలా క్లిష్టముగా ఉండే అవకాశం ఉంది. ప్రహేళిక ఎంత క్లిష్టముగా ఉండాలి అనే నిర్ణయము ప్రహేళికను తయారు చేసేవారు పరిష్కరించేవారిని బట్టి నిర్ణయించుకోవచ్చు. [[కంప్యూటరు]] సహాయముతో కోట్లాది ప్రహేళికలను తయారు చెయ్యడము చాలా తేలిక కావున, సాధారణంగా అత్యంత సులువు దగ్గర నుండి అత్యంత కఠినం వరకు విభిన్న స్థాయిలలో ప్రహేళికలను తయారు చేస్తారు. చాలా వెబ్ సైట్స్ లో ఈ ప్రహేళికలు ఉచితముగా కూడా దొరుకుతాయి.
 
== పరిష్కరించు విధానాలు ==
పరిష్కరించే యుక్తిని సాధారణంగా మూడు పద్దతులుగా విభజించవచ్చును. పరిశీలించడము (స్కానింగ్), చిన్న చిన్న గుర్తులు పెట్టుకోవడము (మార్కింగ్ అప్), విశ్లేషించడము
[[బొమ్మఫైలు:Cross-hatching.svg|thumb|left|200px| క్రాస్ హాచింగ్‌కు ఉదాహరణ: అన్నిటి కంటే పైన, కుడివైపున ఉన్న 3X3 చతురస్రములో 5 ఉండాలి. పై రెండు అడ్డ వరుసలలో ఇప్పటికే 5లు ఉన్నవి. ఆఖరి నిలువు వరుసలో కూడా ఒక 5 ఉన్నది. ఇంక 5 ఉండడానికి ఆస్కారం ఉన్న ఏకైక ప్రదేశము ఆకుపచ్చ రంగు నిండిన గడి మాత్రమే.]]
 
=== పరిశీలించడము ===
పంక్తి 35:
క్లిష్టమైన ప్రహేళికలు పరిష్కరించడానికి సామాన్య స్కానింగుతో పాటు ఇతర కిటుకులను కూడా వాడవలెను.
 
[[బొమ్మఫైలు:Sudoku analysis dot notation.svg|thumb|right| ఒక గడిలో సాధ్యమయ్యే అంకెలను నిర్ధారించుటకు పెన్సిల్ చుక్కలను పెట్టుకోవచ్చు. మొదట స్కానింగ్ చేస్తే ఒక్కొక్క గడి లో పెట్టే చుక్కలను తగ్గించుకోవచ్చు.]]
 
=== గుర్తులు పెట్టడము ===
పంక్తి 43:
*అనుభవజ్ఞులైన వారు 1 నుండి 9 వరకు చుక్కలు పెట్టుకంటారు. ఈ విధానము కొంచము అయోమయంగా ఉండి తప్పులు జరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది.
 
=== విశ్లేషణ ===
రెండు ముఖ్యమైన పద్దతులు:
క్యాండిడేట్ ఎలిమినేషన్ (విలోపనా పద్ధతి): గడిలో ఉండగలిగే అన్ని అంకెలను పై గుర్తులను వాడి ఆ గడి లో వ్రాసుకుని,(సులువైన ప్రహేళికలలో ఒకొక్క గడికి రెండో, మూడో ఉండగలుగుతాయి) ఒకొక్క అంకెను పరిశీలించి గడిలో పట్టే అంకెను కనుక్కోవడము. ఒకొక్కసారి తటస్థమైన అంకెల వల్ల రెండు మూడు సార్లు స్కాన్ చెయ్యవలసి రావచ్చును. ఒక అంకెను గడిలో ఉంచడము వల్ల ప్రహేళికలో వేరే భాగాలలో అంకెలను నింపలేనప్పుడు ఆ అంకెను తీసివేయవచ్చును.
పంక్తి 51:
ఈ పద్ధతిని ఉపయోగించటానికి ఒక పెన్సిల్, రబ్బరు, మంచి జ్ఞాపక శక్తి కావలెను.
 
=== మీడియాలో ప్రాముఖ్యత ===
1997లో ఒక 59 ఏళ్ళ పదవీ విరమణ చేసిన [[హాంగ్ కాంగ్]] జడ్జి, [[న్యూజీలాండ్]]లో ఉంటూ, ఒక జపనీసు పుస్తకాల షాపులో సగము పూర్తి చెయ్యబడిన ఒక సుడోకు ప్రహేళికను చూశాడు. ఆ తరువాత 6 సంవత్సరాల కాలములో ఈ ప్రహేళికలను త్వరగా తయారు చెయ్యడానికి ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను వ్రాశాడు. [[ద టైమ్స్]] అను ఒక బ్రిటీష్ దినపత్రిక వారు నవంబరు 12, 2004 నుండి ఈ ప్రహేళికను రోజూ దినపత్రికలో భాగంగా ముద్రించడము ప్రారంభించారు.
 
అప్పటివరకు అంధకారములో ఉన్న సుడోకుకు అకస్మాత్తుగా అనూహ్యమైన ఖ్యాతి రాగా, అన్ని దినపత్రికలూ సుడోకూ పై వ్యాసాలు వ్రాయడము మొదలు పెట్టినాయి. టైమ్స్, పాఠకుల మానసిక పరిధులను దృష్టిలో పెట్టుకొని జూన్ 20, 2005 నుండి, ఒక సులువు మరియు ఒక కఠిన ప్రహేళికలను పక్క పక్కనే ప్రచురించడము మొదలుపెట్టింది. అ తరువాత ఈ ప్రహేళిక క్రమంగా అన్ని దేశాలలో ప్రసిద్ధి చెందింది.
 
== ఇవి కూడా చూడండి ==
*[[రూబిక్స్ క్యూబ్]]
*[[:en:List_of_Nikoli_puzzle_types|నికోలాయి ప్రహేళిక లో రకాలు]]
పంక్తి 71:
*[[:en:Logic_puzzle|లాజిక్ ప్రహేళిక]]
 
== వనరులు ==
<!-- NB: References are *not* the same thing as external links; they are resources used to write, or useful in verifying, the article's content -->
<div class="references-2column"><references /></div>
పంక్తి 144:
[[sv:Sudoku]]
[[th:ซูโดะกุ]]
[[tl:Sudoku]]
[[tr:Sudoku]]
[[uk:Судоку]]
"https://te.wikipedia.org/wiki/సుడోకు" నుండి వెలికితీశారు