పేదరికం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త మొలక
(తేడా లేదు)

15:23, 5 ఆగస్టు 2009 నాటి కూర్పు

పేదరికం ఒక సామాజిక, ఆర్థిక సమస్య. ఇది దీర్ఘకాలిక సామాజిక సమస్యగా ఉంది.సమాజంలో ఒక వర్గం కనీస అవసరాలైన ఆహారం, గృహవసతి, దుస్తులు పొందలేని పరిస్థితి ని పేదరికం అంటారు.

స్వభావాన్ని బట్టి పేదరికాన్ని సాపేక్ష, నిరపేక్ష పేదరికం అని విభజించవచ్చు.

సాపేక్ష పేదరికం

జనాభాను వివిధ ఆదాయ వర్గాలుగా విభజించి అత్యధిక ఆదాయం పొందే 5% నుంచి 10% ప్రజల జీవనస్థాయితో అతి తక్కువ ఆదాయం పొందే అట్టడుగు 5% నుంచి 10% ప్రజల స్థాయిని పోల్చి పేదరికాన్ని నిర్ణయిస్తారు. సాపేక్ష పేదరికం ద్వారా ఆర్థిక అసమానతలను లెక్కించవచ్చు.

నిరపేక్ష పేదరికం

ప్రజలకు కావలసిన కనీస అవసర వస్తువుల పరిమాణాన్ని నిర్ణయించి, దాన్ని కనీస ద్రవ్యరూప తలసరి వినియోగం నిర్ణయిస్తారు. ఈ తలసరి కనీస ద్రవ్య రూప వినియోగ స్థాయి కంటే తక్కువ ఉన్న జనాభాను నిరపేక్ష పేదవారు అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పేదరికం&oldid=445148" నుండి వెలికితీశారు