పేదరికం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
==నివారణ చర్యలు==
1950 నుంచి 1970 వరకు భారత ప్రభుత్వం పేదరికాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రత్యక్ష చర్యలు చేపట్టలేదు.ఆర్థికాభివృద్ధిని సాధిస్తే పేదరికం దానంతట అదే తగ్గుతుందనే సిద్ధాంతాన్ని నమ్మింది. 4వ ప్రణాళికలో భాగంగా పేదరికాన్ని తగ్గించడానికి ప్రత్యక్ష చర్యలు మొదలయ్యాయి. పేదరికం తీవ్రతను అంచనా వేసి '''గరీబీ హఠావో''' అనే నినాదాన్ని ప్రభుత్వం చేపట్టింది.
 
1973 నుంచీ అనేక గ్రామీణాభివృద్ధి పథకాలను చేపట్టింది. 1972-73 లో మహరాష్ట్ర లో ఉపాధి హామీ పథకం, 1973 లో క్షామపీడిత అభివృద్ధి కార్యక్రమం, 1974-75 లో చిన్నకారు రైతుల అభివృద్ధి ఏజన్సీ, ఆయకట్టు అభివృద్ధి పథకం. 1975లో ప్రధాని 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించింది. 1977-78 లో ఎడారుల అభివృద్ధి పథకం, పనికి ఆహార పథకం, అంత్యోదయ పథకాలను ప్రవేశపెట్టారు. 1979లో గ్రామీణ ప్రాంత యువకులకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడానికి చర్యలు పెట్టారు.
"https://te.wikipedia.org/wiki/పేదరికం" నుండి వెలికితీశారు