వంగపండు ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వంగపండు ప్రసాదరావు''' ([[ఆంగ్లం]]: Vangapandu Prasada Rao) ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి అధ్యక్షుడు. [[హేతువాది]], ఉత్తరాంధ్ర [[గద్దర్]] గా పేరుతెచ్చుకున్నాడు. [[పార్వతీపురం]] దగ్గర [[పెదబొండపల్లి]] స్వస్థలం. [[1943]] జూన్ లో జన్మించారు. తండ్రి జగన్నాధం తల్లి చినతల్లి. 23.11.2008 న తెనాలిలో ఈయనకు [[బొల్లిముంత శివరామకృష్ణ]] సాహితీ అవార్డును [[బి.నరసింగరావు]] చేతులమీదుగా ప్రధానం చేశారు.<ref>[http://www.hindu.com/2008/11/24/stories/2008112458330300.htm Vangapandu feted] - The Hindu నవంబర్ 24, 2008</ref> ప్రజలకోసం బ్రతికిన [[నాజర్]] లాంటి కళాకారుడని [[వంగపండు]] ను పోలుస్తారు.
 
వంగపండు ప్రసాదరావు, గద్దర్ తో కలిసి 1972లో పీపుల్స్ వార్ యొక్క సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించాడు. వంగపండు మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు వ్రాశాడు. అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ మరియు హిందీ వంటి పది భారతీయ భాషలలోకి కూడా అనువదించబడినవి. "యంత్రమెట్టా నడుస్తు ఉందంటే..." అనే పాట ఒక ఆచార్యునిచే ఆంగ్లంలో కూడా అనువదించబడి అమెరికా, ఇంగ్లాండులో అభిమానం చూరగొన్నది.<ref>[http://www.hindu.com/thehindu/mp/2004/08/02/stories/2004080201670300.htm Sings his way into hearts] - The Hindu ఆగష్టు 02, 2004</ref>
"https://te.wikipedia.org/wiki/వంగపండు_ప్రసాదరావు" నుండి వెలికితీశారు