ప్రధాన మెనూను తెరువు

మార్పులు

40 bytes added ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
 
'''ఇడ్లీ''' ([[ఆంగ్లం]]': Idli or Idly) దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప్పప్పు మరియు బియ్యపుపిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి ఆవిరితో ఉడికించి తయారుచేస్తారు. పులియబెట్టే ప్రక్రియలో పప్పు మరియు బియ్యంలోని స్టార్చ్ శరీరం జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విఛ్ఛిన్నం చెందుతుంది.
 
సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా తినే ఇడ్లీలను, వాటితో పాటు నంజుకుని తినటానికి చట్నీ లేదా సాంబారు లేదా కారంపొడిగానీ, పచ్చడితో గానీ వడ్డిస్తారు. ఎండు మసాలాలను కలిపి దంచి తయారుచేసిన ముళగాయి పొడి వంటి పొడులు ఇడ్లీలను ప్రయాణాలలో వెళుతూ వెళుతూ తినటానికి అనువుగా ఉంటాయి. అంతే కాకుండా, ఇడ్లీలు ప్రపంచంలోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.{{Fact|date=June 2009}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/445246" నుండి వెలికితీశారు