ఇడ్లీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
దోశకు మరియు వడకు తమిళ దేశాన రెండు వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలదు కానీ, ఇడ్లీ మాత్రము విదేశీ దిగుమతి. సాహిత్యములో తొలిసారి ఇడ్లీ వంటి వంటకము యొక్క ప్రస్తావన (ఇడ్డలిగే) [[920]] లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే [[కన్నడ]] రచనలో ఉన్నది. ఆ తరువాత [[1130]] లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి [[సోమేశ్వర III]] రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము ''[[మానసోల్లాస]]'' లో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడినది. అయితే ఈ రచనలలో ఆధునిక ఇడ్లీ తయారీకి ప్రధాన భాగలైన మినపప్పు తో పాటు బియ్యపుపిండి కలపడము, పిండిని పులియబెట్టడము, పిండి పొంగడానికి ఆవిరిపట్టడము మొదలైన విషయాల గురించిన ప్రస్తావన లేదు.
 
తెలుగులో ఇడ్లీలను ఇడ్డెనలు అంటారు. ప్రస్తుతము ఈ పేరు వాడకం తగ్గినది.
 
[[చైనా]] యాత్రికుడు [[హుయాన్ త్సాంగ్]] (7వ శతాబ్దము) రచనల వలన [[భారత దేశము]]లో ఆ కాలములో ఆవిరిపట్టే పాత్రలు లేవని తెలుస్తున్నది కానీ భారతీయులు మరుగుతున్న గిన్నెపై బట్టకప్పి ఆవిరిపట్టి ఉండవచ్చని భావిస్తారు. ఇండొనేషియన్లు అనేకరకాల పులియబెట్టే వంటకాలు వండేవారు అందులో ఇడ్లీకి పోలికలున్న కేడ్లీ అనే వంటకము కూడా ఉన్నది. 800 - 1200 మధ్య కాలములో [[ఇండోనేషియా]] హిందూ రాజులతో పాటు వెళ్లిన వంటవాళ్లు, పులియపెట్టే పద్ధతులు, అవిరిపెట్టే పద్ధతులు మరియు వాళ్ల వంటకము కేడ్లీని దక్షిణ భారతదేశానికి తెచ్చారని ఒక భావన కానీ ఖచ్చితముగా నిర్ధారించుటకు ఆధారములు లేవు.
Line 15 ⟶ 17:
ఇడ్లీ ఎక్కడి నుండి దిగుమతి అయినా భారతీయుల ప్రియమైన అల్పాహార వంటకాలలో ఒకటిగా విలసిల్లుతున్నది. భారతదేశపు [[పల్లె]] పల్లెలో ఇడ్లీ గురించి తెలియని వారు తక్కువ. ప్రతి హోటలు నందు మెనూలో తప్పక చేర్చు వంటకం ఇడ్లీ.
[[బొమ్మ:Rava idli.JPG|left|thumb|రవ్వ ఇడ్లీ]]
 
==ఇవి కూడా చూడండి==
*[[రవ్వ ఇడ్లీ]]
"https://te.wikipedia.org/wiki/ఇడ్లీ" నుండి వెలికితీశారు