భండారు అచ్చమాంబ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి '' ఇదే పేరు గల ఇతర వ్యక్తుల కోసం అయోమయ నివృత్తి పేజీ అచ్చమాంబ చూడండి.''
పంక్తి 1:
'' ఇదే పేరు గల ఇతర వ్యక్తుల కోసం అయోమయ నివృత్తి పేజీ [[అచ్చమాంబ]] చూడండి.''
 
[[ఫైలు:Bandaru Acchamamba.JPG|right|150px]]
'''బండారు అచ్చమాంబ''' ([[1874]] - [[1905]]) తొలి తెలుగు కథా రచయిత్రి. ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన [[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు]]కు అక్క. అచ్చమాంబ [[గురజాడ అప్పారావు]] కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రధమ స్త్రీవాద చరిత్ర కారణి. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది. అచ్చమాంబ [[1874]] వ సంవత్సరంలో కృష్ణా జిల్లా [[నందిగామ]] దగ్గర [[పెనుగంచిప్రోలు]] లో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి [[మచిలీపట్నం]]లో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. అనాధ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు. [[1905]] [[జనవరి 18]]వ తేదీన ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది.
"https://te.wikipedia.org/wiki/భండారు_అచ్చమాంబ" నుండి వెలికితీశారు