మైదాన హాకీ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ka:ბალახის ჰოკეი
చి యంత్రము కలుపుతున్నది: uk:Хокей на траві; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:Field_hockey.jpg|thumb|right|275px| మైదాన హాకీ అడబడుచున్న దృశ్యం]]
 
'''మైదాన హాకీ''' అనేది ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచిన క్రీడ, దీనిని పురుష స్త్రీలిరువురూ అడతారు. దీని అధికారిక పేరు ఉత్త హాకీ మాత్రమే, భారత దేశంతో సహా పలు చోట్ల దీనిని హాకీ గానే వ్యవహరిస్తారు. <ref name="definition">[http://www.fihockey.org/ International Hockey Federation]</ref><ref name="definition2">[http://www.olympic.org/ Official website of the Olympic movement]</ref> కానీ కొన్నిదేశాలలో <ref name="definition3">[[International Hockey Federation|American Samoa, Azerbaijan, Canada, Latvia, Moldova, Romania, U.S]]</ref> దీనిని అక్కడ ప్రసిద్ధిగాంచిన [[హాకీ|ఇతర రకములైన]] హాకీల నుండి గుర్తంచడానికి మైదాన హాకీ గా వ్యవహరిస్తారు. అదే కారణం చేత వివిధ విజ్ఞానసర్వస్వములు కూడా దీనిని మైదన హాకీగా వ్యవహరిస్తారు.
 
హాకీలో తరచూగా జరిగే చాలా గౌరవప్రథమైన అంజర్జాతీయ ఆటలపోటీలు పురుషస్త్రీలిరువురికీ ఉన్నాయి. వాటిలో కొన్ని, [[వేసవి ఒలింపిక్స్]], నాలుగేళ్ళకోసారి జరిగే [[ప్రపంచ కప్ హాకీ]], వార్షికంగా జరిగే [[ఛాంపియన్స్ ట్రోఫీ(మైదాన హాకీ)|ఛాంపియన్స్ ట్రోఫీ]] మరియు కుమారుల ప్రపంచ కప్ హాకీ.
 
1980 వరకూ జరిగిన ఐదు ప్రపంచ కప్పు హాకీలలో భారతదేశపు మరియు [[పాకిస్థాన్]] దేశపు జట్లు నాలుగు సార్లు విజయాన్ని కైవసంచేసుకున్నాయి. కానీ ఆ తరువాత గడ్డినుండి ఆశ్ట్రో టర్ఫుకు హాకీ మైదానాన్ని మార్చి నప్పుడు వేరే జట్లు ప్రాముఖ్యతలోకి వచ్చాయి. వాటిలో కొన్ని [[నెథెర్లాండ్సు]], [[జెర్మనీ]], [[ఆస్ట్రేలియా]], [[స్పైను]], [[అర్జంటినా]], [[ఇంగ్లాండు]] మరియు [[దక్షిణ కొరియా]].
 
ఈ క్రీడను [[అంతర్జాతీయ హాకీ కూటమి]] (FIH) నియంత్రిస్తుంది. అందులో భాగంగా హాకీలోని నిబంధనలు కూడా వివరింపబడతాయి.
 
పలు దేశాలలో హాకీని క్లబ్లు క్రీడగా తీర్చిదిద్దారు, కానీ వాటికి ఉండవలసినంత ఆధరణ లేక కొందరు మాత్రమే హాకీని వృత్తిగా చేసుకొనగలిగారు. ఇక ఉత్తర అమెరికా, మరియు అర్జెంటినాలలో దీనిని ఎక్కువగా ఆడవారి క్రీడ గా పరిగణిస్తారు.
 
== చరిత్ర ==
[[Imageఫైలు:Girlsfieldhockey.jpg|thumb|right|275px|మహిళల హాకీ, గడ్డిపై. 1970ల వరకూ ఆటలపోటీలలో గడ్డిమీదే ఆడబడిన హాకీ ఇప్పుడు కృత్రిమ మైదానల మీద ఆడబడుతున్నది.]]
హాకీ లాంటి కఱ్ఱతో బంతిని కొట్టే ఆటలు అనాధిగా ఆడబడుతూనే ఉన్నాయి. ఆధునిక హాకీ మాత్రం ఇంగ్లాండులోని ప్రభుత్వ పాఠశాలలో మొదలైంది. మొదటి హాకీ సంఘము 1886లో స్ధాపింపబడినది. అంర్జాతీయంగా 1895లో ఆడబడినది ([[ఐర్లాండు]]3, [[వేల్సు]] 0). నిభందనల board 1900లో స్థాపింపబడినది. ఒలింపిక్ క్రీడలలో 1908, 1920లో మరియి 1928 నుండి ప్రతి సారి ఆడబడుతున్నది.
 
భారతదేశానికి దీన్ని బ్రీటీషువారు తీసుకువచ్చారు. మొదటి క్లబ్బు 1885 లో కొలకొత్తాలో ఏర్పడింది. ఇంకో పదేళ్ళలో [[బీటంన్ కప్పు]] మఱియు [[ఆఘా ఖాన్ కప్పు]] మొదలయ్యాయి. 1928లో భారతదేశం ఒలింపిక్ క్రీడలలో వారు ఆడిన ఐదు ఆటలు ప్రత్యర్థికి ఒక్క లక్ష్యం కూడా ఇవ్వకుండా నెగ్గి బంగారు పథకాన్ని గెలుచుకుంది. అప్పటినుండి 1956 వరకు ప్రతి సారి భారత్ కే స్వర్ణం దక్కింది. 1964 మఱియు 1980 లలో కూడా భారత్ దే స్వరణం. 1960, 1968 మఱియు 1984లలో పాకిస్థాన్ నెగ్గింది.
 
 
 
1970లలో కృత్రిమ మైదానాలను పోటీలలో ఉపయోగించడం మొదులు పెట్టారు. గడ్డి బదులుగా దీనిని వాడడం హాకీ క్రీడనే మార్చివేసింది. ఆట చాలా వేగవంతమైంది. కొత్త వ్యూహములు చోటు చేసుకున్నాయి, వాటికి అనుగుణంగా నిబంధనలు కూడా మార్చబడ్డాయి. దీనితో హాకీ పై భారత్ పాక్ ల ఆధిపత్యం క్షీణించింది. దీనికి కారణం కృత్రిమ మైదానలను నిక్షిప్తించడం చాలా వెలతో కూడిన విషయవఁవడం. ధనిక దేశాలకు ఇది అడ్డంకు కాలేదు. పైగా భారతపాక్‌లలో, దీనిని గ్రామీణ ప్రాంతలలో ఎక్కువ ఆడుదురు.
 
మహిళలు కూడా ఇంగ్లాండులో 1880ల నుండే హాకీ అడినా, వారు కృత్రిమ మైదానల రాకతో ఎక్కువ గా ఆడడం మొదలు పెట్టారు. మహిళాహాకీ ఒలింపిక్ క్రీడలలో 1980 నుండి ప్రవేశ పెట్టడం జరిగింది.
 
== ఆట మైదానము ==
[[Imageఫైలు:Sydney 2000 Olympic hockey.jpg|thumb|right|హాకీ మైదాన ఉదాహరణ - సిడ్నీ ఒలింపిక్ ఉద్యానవనం లోని హాకీ మైదానం]]
 
జట్టుకు పదకొండు మంది ఆటగాళ్ళు(గర్తెలు), మైదానము 91.40 మీ × 55 మీ కొలతలున్న చతుర్భుజము. ఇఱుచివర్లన 2.14 మీ (7 అడుగుల) ఎత్తు మఱియు 3.66 మీ (12 అడుగుల) వెడల్పు ఉన్న లక్ష్యాలు ఉంటాయి.
ఈ లక్ష్యానికి 14.63 మీ (16 గజాల) దూరంలో వృత్తాకారంలో ''shooting circle'' (లేదా ''D'') ఉంటుంది. దీనికి 5మీ దూరం లో చుక్కల తో ఇంకో అరవృత్తం ఉండును. ఇక మైదానానికి అడ్డంగా లక్ష్యాలకి 22.90 మీ (25 గజాల) దూరంలో అడ్డరేఖలు ఉంటాయి. మైదానాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తూ ఒక రేఖ ఉంటుంది. "D" మధ్యలో పెనాల్టి స్పాట్ ఉంటుంది. ఇది లక్ష్యరేఖమధ్యాలకి 6.40 మీ (7 గజాలు) దూరంలో ఉంటుంది.
 
నేటి హాకీలో నీరు చల్లబడిన కృత్రిమ మైదానలు పోటిలకు వాడబడతాయి. వీటితో బంతి చాలా వేగంగా వెళుతుంది. ఇదే కారణం చేత కొన్నాళ్ళు మట్టి/ఇసుక కూడిన మైదానపై హాకీ ఆడడం జరిగింది. ఐతే మట్టి కంటే నీరు కూడిన కృత్రిమ మైదనాలు ఆటగాండ్లకు (ఆటగర్తెలకు) సురక్షితం కాబట్టి అవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాతావరణానికి అనుగుణంగా ఉండడానికని నీరు తక్కువ వాడే విన్నూతనమైన మైదానాలు తయారుజేయ కృషి చేస్తున్నారు.
 
== నిభందనలు ==
[[Imageఫైలు:Hockey field.svg|thumb|right|ఆట మైదాన బొమ్మ]]
ఆటవాళ్ళు బంతిని కఱ్ఱ యొక్క (గుండ్రప్పటి వెనుకు తప్ప) ఏ భాగము తోనైనా కొట్టవచ్చు. నునుపక్క ఎప్పుడూ కఱ్ఱ యొక్క ‘సహజ’ ప్రక్క ఉండును (కుడిచేతివాటం ఉన్నవారికి).; హాకీలో ఎడమ చేతి వాటపు కఱ్ఱలు ఉండవు.
 
=== స్థితులు ===
 
జట్టుకు పదకొండు మంది ఆటగాళ్ళుందురు. వీరికి తోడు బల్ల మీద కూర్చున్నవారు ఐదుగురి వరకూ లోనికి రావచ్చు. జట్టులో మొత్తం పదహారు మందికి స్ధానం ఉంటుంది. ఆటలో ఎన్ని మార్పిడిలైనా చేయవచ్చు కాని ‘పెనాల్టి కార్నర్ట’ అప్పుడు మార్పిడి చేయరాదు.
 
ఆటవాళ్ళకు నిబంధనల ప్రకారం నిర్ణేత చోట్లంటూ ఎఁవ్ లేవు. గోలీ (బంతిని లక్ష్యంలోనికి వెళ్ళకుండా ప్రయత్నించి వ్యక్తి) కూడా ఉండనవసరం లేదు. ఐనా ప్రతి జట్టు, ఆటవాళ్ళ ను, రక్షాపంక్తి, మధ్య పంక్తి, ఆక్రమణ పంక్తి గా విభజించడం జరుగుతుంది, Many teams include a single [[Football (soccer) positions#Sweeper/Libero|sweeper]].
ఆట జరగడానికి ఇంత మంది ఆటవాళ్ళు ఉండాలనే నిబంధనలు కూడా లేవు.
 
ప్రతి జట్టులో ఒక క్రీడాకారుడు/ణి గోల్ కీపర్ గా నియమింపబడతారు. వారు తగిన హెల్మెట్ మరియు కాలు చేతులకు ఇతర రక్షిత కవచములు ధరింపవలెను. గోలుకీపరు తన శరీరంలోని మఱియు తన కవచములలో దేనితోనైనా బంతిని గోలు లోనికి పోకుండా అప వచ్చు. అలానే, బంతిని దేనితోనైనా తన్న లేద కొట్టవచ్చు. కానీ వారు అన్ని సమయములలోనూ ఒక హాకీ కఱ్ఱను ధరించవలెను. గోలుకీపరు D బయటకు వచ్చినప్పుడు మాత్రమ ఇతర ఆటవారికి వలె, కఱ్ఱతో మాత్రమే బంతిని తాకవలెను. పెనల్టీ స్ట్రోకు తీసు కోనేందుకు మాత్రమే గోలీలు తమ 23మీ గీతను దాటి బయటకు రావడానికి అనుమతింపబడుదురు. అన్య వేళల అలా రావడం నిబంధనలకు విరుద్ధం.
 
=== మామూలు ఆట ===
 
నిబంధలకోసం ఆటవారిని ఆక్రమికులు లేదా రక్షకులుగా పిలువడం జరుగుతుంది. బంతి తమ వద్ద ఉన్న వ్యక్తులను ఆక్రమికులు గానూ, బంతి తమ వద్దలేని వారిని రక్షకులుగా వ్యవహిరిస్తారు.
 
[[Imageఫైలు:Brenda256.jpg|thumb|left|ప్రక్క రేఖ నుండి కొట్టుట]]
 
ప్రతి ఆటని ఇద్దరు అంపైరులు పర్యవేక్షింతురు. ఒకో అంపైరూ మైదానంలోని ఒకో భాగాన్ని పర్యవేక్షింతురు. వీరికి తోడుగా సాంకేతిక సిబ్బంది ఉంటారు. వారిలో భాగమే ఒ కాల నిర్దేశి మఱియు స్కోరు నిర్దేశి.
పంక్తి 56:
బంతిని అవుతలి జట్టు నుండి తమ అధీనంలోకి రాబట్టు కోవడానికి ఎల్లప్పుడూ రక్షణ ఆటవారు ప్రయత్నిస్తుంటారు. అలా అవతలి జట్టు ఆక్రమికులని అడ్డు కొనునప్పుడు, బంతిని తాకక ముందు వ్యక్తిని తాకడం దండనీయం. బంతి తన వద్దనున్న ఆటవారు తమ శరీరముతో రక్షకులని త్రోయరాదు.
 
ఆటవాళ్ళు తమ కాలితో బంతిని తాకరాదు. అనుకోకుండా తాకినప్పుడు, అలా తాకుటవలన వారు లబ్ధి పొందకున్న వారిని శిక్షంచరు.
 
దండనీయ అడ్డుకోవడాలు మూడు విధాలుగా జరుగుతాయి, 1) రక్షకులు ఆక్రమికుని,. బంతికీ మధ్య, న్యాయబద్దమైన టాకిల్ చేయకుండా రావడం. 2) రక్షకులి కఱ్ఱ బంతిని తాకకుండా ఆక్రమికులి కఱ్ఱకి మాత్రమే తగలడం 3) ప్రత్యర్థులకీ బంతికీ, మధ్య వచ్చి వారిని బంతికి చేరుకోకుండా ఆపడం.
పంక్తి 63:
 
 
=== కొన్ని పద్ధతులు ===
==== ఫ్రీ హిట్ ====
 
'కొట్టదగ్గ వృత్తాల' బయట తప్పిదములు జరిగితే, ఫ్రీ హిట్ ఇవ్వబడును. అన్యయం జరిగిన జట్టు అప్పుడు బంతిని తమ ఇష్టము వచ్చిన దిశగా త్రోయలేద పంపించవచ్చు. కాని బంతిని గాలిలోనికి ఉద్దేశ పూర్వకంగా ఎత్తరాదు. ఎత్తిన అది కూడా తప్పిదముగ పరిగణించబడును. ఫ్రీ హిట్ అపుడు ప్రత్యర్థలు బంతికి కనీసం 5 మీ. దూరంలో ఉండాలి. బంతిని కొట్టబోవు ఆటవాని వద్ద తన తోటి జట్టు వారొకరైనా ఉంటే, ప్రత్యర్థలు కూడా ఆ 5 మీ. కన్నా దగ్గరగా రావచ్చు.
పంక్తి 70:
15 మీ. లలోపు ఆక్రమణ జట్టు తప్పిదము చేస్తే, రక్షణ జట్టు కు 15 మీ. దగ్గర నుండి ఫ్రీ హిట్ ఇవ్వబడుతుంది. అంటే వెనుక రేఖకు సమీపంగా ఫ్రీ హిట్‌లు ఇవ్వబడవు. అటులనే, ఆక్రమణ జట్టు వారు బంతిని వెనుక రేఖ బయటకు పంపిన, 15మీ ఫ్రీహిట్ రక్షణ జట్టుకు ఇవ్వబడుతుంది .ఆక్రమణ జట్టు వారు ఆక్రమించదలచిన అరవృత్తంలో తప్పిదము చేస్తే, రక్షణ జట్టుకి బంతి ఇచ్చి, అరవృత్తంలో ఎక్కడినుంచైనా ఫ్రీ హిట్ చేసుకునే వీలుని కల్పిస్తారు.
 
==== దూరపు మూల నుండి ====
 
'లాంగ్ కార్నర్' అనగా చతుర్భుజము యొక్క కోణమునకు 5 మీ. దూరములో ప్రక్క రేఖ నుండి ఆక్రమణ జట్టుకు బంతిని ఇష్టానుసారం కొట్టుకునే వీలు ఇవ్వడం. రక్షణ జట్టు లో ఒకరు తాకిన బంతి వెనుక రేఖ దాటి బయటకు వెళితే ఇది ఇవ్వబడును.
 
==== దండనా మూల నుండి ====
 
'పెనాల్టి కార్నర్' ని ఆక్రమణ జట్టుకి బహుకరిస్తారు. ఇది జరగడానికి, రక్షణా జట్టు వారి ఆక్రమణ అరవృత్తంలో తప్పిదము చేసి ఉండాలి. అప్పుడప్పుడూ దీన్ని 23మీ రక్షణా సీమలో ఉన్నప్పుడు పెద్ద తప్పిదములు చేసినా ఇవ్వవచ్చు. అలానే దీనిని రక్షణా జట్టు కావాలని (15 మీ. ఫ్రీ హీట్ చెయ్యడానికి) బంతిని వెనుక రేఖ మీదగా బయటకు పంపడం చేస్తే ఇవ్వబడుతుంది. ఇది ఎక్కువగా బంతి రక్షణ జట్టు ఆటవారి కాలు కి తాకిన ఇవ్వబడడం జరుగుతుంది.
 
[[Imageఫైలు:Shortcorner.jpeg|right|thumb|right|నలుగురు రక్షకులు మఱియు గోలుకీపరు పెనాల్టి కార్నర్ కోఱకు వేచియున్నారు.]]
 
పెనాల్టి కార్నర్లుకు సిద్ధమవడానికి నలుగురు రక్షకులు మరియు గోలీ వెనుక రేఖ వెనుక నుంచోవాలి. సహజంగా వారు, గోలు డబ్బాలోనే నుంచుంటారు. మిగిలిన రక్షకులందరూ మధ్యరేఖ దగ్గర కు వెళ్ళినుంచోవాలి. ఆక్రమణ సిబ్బంది D కి బయట నుంచుంటారు. ఒక ఆక్రమణ వ్యక్తి మాత్రము, బంతితో పాటు గొలుకు 10మీ. దూరంలో వెనుక గీత వద్ద నుంచుందును. అమె బంతిని D బయట ఉన్న ఆటవాళ్ళకి అందిచగా వారు దానిని D లోనికి తెచ్చిన పిదప, గోలులోనికి పంపడానికి ప్రయత్నింతురు. ఆటవారి రక్షణ కోసం, మొదట కొట్టిన బంతి 460మిమి లకంటే ఎత్తు ఎగర రాదు.
పంక్తి 84:
గోలులోనికి పంపే మొదటి ప్రయత్నం మాత్రము తోపుడు, ఫ్లిక్ లేదా స్కూప్ అయ్యిఉండాలి. ఎక్కవగా ఇటువంటి సందర్భాలలో, బంతిని లాగి విసరడం ఎక్కువ జరుగుతుంది.
 
==== శిక్షార్థము కొట్టు అవకాశము ====
 
'''పెనాల్టి స్ట్రోకు''' దీనిని రక్షా ఆటవారిలో ఒకరు బంతిని గోలు లోనికి పోకుండా కావాలని అక్రమంగా ఆపప్రయత్నిస్తే, ఆక్రమణ జట్టుకు ఇవ్వబడుతుంది. దీనిని పెనాల్టి కార్నరప్పుడు రక్షకులు బంతి కంటే ముందే వెనుక రేఖను దాటడం పదే పదే చేసినా ఇవ్వబడును.
 
పెనాల్టి స్ట్రోకప్పుడు ఒక ఆక్రమణ ఆటవారు గోలికి ముఖా ముఖిగా నుంచుందురు. గోలీ గోలు రేఖ మీద కదలకుండా నించోవాలి. ఆక్రమణ ఆటవారు బంతితో సహా దానికి తాకగల దూరాన నుంచుందురు. అంపైరు ఈల వెయ్యగానే, అతను/ఆమె దాని గోలులోనికి, తొయ్యడం, లేదా ఎత్తి విసరడం చెయ్యవచ్చు. బంతిని గట్టిగా కొట్టుట, ముందుకు లాగుట నిషిద్దం. గోలి దానిని లోనికి పోకుండా ఆపవలెను. బంతి గోలు వైపు కొట్టి ఆక్రమణ వ్యక్తి వైదొలగవలెను. గోలు విజయవంతమైతే, మధ్యరేఖ నుండి, లేకుంటే 15మీ రేఖ నుండి రక్షణా జట్టుచే ప్రారంభింపబడును.
 
=== ప్రమాదకర ఆటలు, గాలిలో బంతి ===
 
బంతిని ప్రమాదకరంగా గాలిలోనికి లేపినచో, అది అవతలి జట్టుకు స్వేచ్ఛా కొట్టుడు కి ఇస్తారు. బంతిని ప్రమాదకరంగా లేపబడినదా లేదా అనేది, పూర్తగా అంపయరే నిర్ణయిస్తారు.
పంక్తి 97:
 
 
గోలు చేయడానికి ప్రయత్నించు నపుడు బంతిని గాలిలోకి లేపడం చేయవచ్చు. కాని అలా చేసినపుడు అది ఎవరికీ ప్రమాదకరము కాకూడదు. సాధారణంగా ఆక్రమణ జట్టు లో వ్యక్తి గోలు పై దాడి చేస్తున్నప్పుడే బంతిని గాలిలోనికి లేపవలెను.
 
కఱ్ఱని ప్రమాదకరంగా వాడడం కూడా ప్రమాదకరమైన ఆట గా పరిగణించబడుతుంది. ఆటవాళ్లు బంతిని తమ భుజములపై భాగమున కొట్టరాదు. గొలును కాపాడడానికి అటుల చేసిన సమయములలో, ముందు బంతిని నియంత్రించేట్టే కొట్టాలి/తాకాలి.
 
=== హెచ్చరికలు మఱియు తొలగింపులు ===
 
హాకీ లో మూడు రకాల కార్డులు హెచ్చరికలు మఱియు తొలగింపులకు వాడబడును.
పంక్తి 107:
* '''పచ్చ కార్డు''' హెచ్చరిక.
* '''పసుపు కార్డు''' తాత్కాలిక తొలగింపు. సాధారణంగా ఐదు నిమిషాలు ఆటనుండి వైదొలగివసివుంటుంది.
* '''ఎఱ్ఱ కార్డు''' సాస్వత తొలగింపు. అప్పుడప్పుడూ ఈ కార్డు వచ్చిన ఆటవారికి కొన్ని తుదిపరి ఆటలలో ఆడు అర్హత ఉండదు.
 
ఒకే ఆటవారికి ఒకే కార్డు పదే పదే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇచ్చిన ప్రతీ సారీ శిక్ష ఇంకా తీవ్రంగా ఉండవలెను. కానీ ఒక తప్పిదముకు కార్డు చూపించబడిన, మఱల అదే తప్పిదము చేసిన ఇంకా తీవ్రమైన కార్డు ఇవ్వవలెను.
=== స్కోరు ===
 
బంతిని తమ ఆక్రమిత అరవృత్తములోకి తెచ్చి గోలు లోనికి పంపుట జట్టు లక్ష్యము. ఆలా రెండు 35 నిమిషాల సగాల పిదప ఎక్కువ గోలులు చేసిన జట్టు విజేత.
పంక్తి 116:
 
 
=== సమాన సంఖ్యలో గోలులు చేసినచో ===
 
ఇఱు ప్రక్కల ఒకే స్కోరు చేసిన, టోర్ని బట్టి విజేతను నిర్ణయించే ప్రక్రియ ఉంటుంది.
చాలా సార్లు ఎఫ్.ఐ.హెచ్ టూర్నమెంటు రెగులేషన్స్ లో వున్నటుగా, 7.5 నిమిషాల రెండు సగాలుగల అధిక సమయం ఆట ఆడబడుతుంది. అధిక సమయంలో స్వర్ణ గోలు లేదు హఠాణ్మరణం అను పద్దతులను పాటిస్తారు. ఈ పద్దతిలో ఒక జట్టు స్కోరు చెయ్యగానే, ఆట ముగించి వారిని విజేత గా ప్రకటిస్తారు.
స్వర్ణ గోలు పద్ధతిని పాటింటనపుడు, అధిక సమయం ఆఖరున కూడా గోలుల సంఖ్య సమానమైతే, విజేతను ''పెనాల్టి స్టోకులు'' ద్వారా నిర్ణయించడం జరుగుతుంది.
 
== స్థానిక నిబంధనలు ==
 
శృంఖల బట్టి కొన్ని నిబంధనలు మారుతుంటాయి. చిన్నారులు ఆడేటప్పుడు, మరియు తీర్థాలలో సరదాకి ఆడేటప్పుడు, ఆట సమయాన్ని కుదించడం జరుగుతుంది. వివిధ దేశ హాకీ సంఘాలు వివిధ నిబంధనలు పాటించడం జరుగుతుంది.
పంక్తి 128:
ఉదాహరణకు భారతదేశం లో ఆడు ''[[ప్రిమియర్ హాకీ లీగ్]]'' లో ఆట నాలుగు పాదాలుగా సాగుతుంది. ఒక్కో పాదానికి 17:30 నిమిషాలు. ఆట మధ్యలో వ్యూహరచనార్థం ''టైమౌట్లు'' కూడా తీసుకోవచ్చు.
 
== ఎత్తుగడలు ==
 
బంతిని మైదానము పై తరలించు విధానములు.
పంక్తి 140:
బంతిని అందించడంలో సఫలత కోసం జట్టు సభ్యులు కొన్ని సంకేతాలు ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో కొన్ని,
"through" or "straight" - బంతిని తిన్నగా ఇంకో ఆటవారికి అందించడానికి.
"Flat" or "square" - ఇది మైదానానికి అడ్డంగా పక్కకి అందించడానికి ఉపయోగించే సంకేతం.
"drop" - బంతిని వెనక్కి అందించుట.
 
పంక్తి 152:
 
== వ్యూహములు ==
వ్యూహాలు ఆటకి ఒక పద్ధతినీ, రీతిని కల్పిస్తాయి. వీటివల్ల ఆటవారికి తమ తమ బాధ్యతలను తేలికగా అర్థం చేసుకునే వీలుంటుంది. అత్యుత్తమ జట్లు చాలా విన్నూత్నమైన వ్యూహాప్రయోగాలు చేసినా, యువ జట్లు మాత్రం ప్రసిధ్ధిపొందిన కొన్ని ఉత్తమ వ్యాహాలనుండి, ఒకదానిని ఎన్నకోవడం జరుగుతుంది. అటువంటి వ్యాహాలలో కొన్ని 4-3-3, 5-3-2, 4-4-2. (రక్షాపంక్తి లో ఆటవారి సంఖ్య - మైదానమధ్య ఆటవారి సంఖ్య - ఆక్రమణ పంక్తిలో ఆడువారి సంఖ్య)
 
ఫుడ్బాలు లాగ హాకీలో కూడా ఒక గోలీ, పది ఇతర ఆటవారు ఉండడం, మఱియు రెండు లక్ష్యచేధన ఉద్దేశంగా అడబడే ఆటలు కాబట్టి రెండిటా వ్యూహ రచనకు చాలా పోలికలు వుంటాయి. ఫుడ్బాలుకు భిన్నంగా హాకీలో ఆఫ్ సైడ్ నియమము లేదు. కాబట్టి ఒక ఆటవారు తమ గోలుకి చాలా దగ్గరగా నుంచుని తమకి బంతిని అందింప కోరగలరు. దీనికి ప్రత్నామ్యాయంగా రక్షణా సిబ్బందిలో ఒక ఆటవారు ఆక్రమణ పంక్తిలో ని ఆటవారికి 'తోడు' గా వుంటారు. దీని మూలంగా 1-4-4-1 (5-4-1 యొక్క వ్యత్యయము) వంటి వ్యూహాల వాడుక కనబడుతుంది.
 
== ప్రఖ్యాత అంతర్జాతీయ హాకీ పోటీలు ==
హాకీకి తరచూగా జరిగే చాలా గౌరవప్రథమైన అంజర్జాతీయ ఆటలపోటీలు పురుషస్త్రీలిరువురికీ ఉన్నాయి. వాటిలో కొన్ని, నాలుగేళ్ళకోసారి జరిగే [[వేసవి ఒలింపిక్స్]], నాలుగేళ్ళకోసారి జరిగే [[ప్రపంచ కప్ హాకీ]], కుమారుల ప్రపంచ కప్ హాకీ, మఱియు వార్షికంగా జరిగే [[ఛాంపియన్స్ ట్రోఫీ(మైదాన హాకీ)|ఛాంపియన్స్ ట్రోఫీ]]. ఛాంపియన్స్ ట్రోఫీ లో ప్రంపంచంలోని ఆఱు అత్యుత్తమ జట్ల మధ్య జరిగే పోటి.
హాకీ ఉమ్మడి ధనం క్రీడలలో 1998 నుండి ప్రవేశ పెట్టారు. [[Commonwealth Games]]. పురుషలలో, భారత్ 8 ఒలింపిక్ స్వర్ణాలను, పాకిస్థాన్ 4 ప్రపంచ కప్పులను గెల్చుకున్నాయి. మహిళలలో ఆస్ట్రేలియా 3 ఒలింపిక స్వర్ణాలను గెలుచుకోగా; నెథర్లాండ్స్ ప్రపంచ కప్పును ఆఱు సార్లు కైవసం చేసుకుంది. వార్షికంగా మలేషియాలో జరిగే [[సుల్తన్ అజ్లన్ షా హాకీ పోటీ]] ఈ మధ్య ప్రఖ్యాతి గాంచుతుంది.
 
== విషయములు ==
<references/>
 
== బాహ్య లంకెలు ==
*[http://www.bharatiyahockey.com భారతీయ హాకీ]
*[http://www.fieldhockey.tv Streaming game footage from the Dutch Premier League and many International Competitions]
పంక్తి 221:
[[sv:Landhockey]]
[[tr:Çim hokeyi]]
[[uk:Хокей на траві]]
[[zh:曲棍球]]
"https://te.wikipedia.org/wiki/మైదాన_హాకీ" నుండి వెలికితీశారు