పెమ్మసాని నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

చి english wiki link added
బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
పంక్తి 11:
 
==రామలింగ నాయుడు==
వీరతిమ్మానాయునికి చెన్నప్పయను కుమారుడు గలడు. చెన్నప్పకు రామలింగ మరియు పెద్దతిమ్మ అను ఇద్దరు కొడుకులు గలరు. వీరిలో రామలింగ నాయుడు మహాయోధునిగా బహుళ పేరుప్రఖ్యాతులు సంపాదించెను. రామలింగ గండికోట ను 1509 నుండి 1530 వరకు పాలించెను. ఈతనివద్ద మహాయోధులగు 80,000 సైనికులు గలరు. విజయనగరములో బస చేయుటకు 1430 కుంటల స్థలము గలదు. శ్రీకృష్ణదేవరాయలకు సామంతునిగా, యుద్ధసమయములలో ముఖ్య సేనాధిపతిగా వ్యవహరించుచు గుల్బర్గా, [[గోల్కొండ]] మరియు అహమ్మదునగరు సేనలపై ఒకేమారి విజయము సాధించి కృష్ణదేవరాయనికి విశ్వాసపాత్రుడయ్యెను. [[రాయచూరి యుద్ధము]]లో అవిక్రపరాక్రముడై విజ్రింభించి అహమ్మదు షా గుడారపు త్రాళ్ళు కోసి సుల్తానును పారద్రోలెను. పెమ్మసాని నరసింహనాయుడు రాయచూరి యుద్ధములో తన అన్నకొడుకైన రామలింగ నాయుని పరాక్రమాలను కొనియాడుతూ ఒక చాటు పద్యములో "ముగ్గురు వజీరులను ముక్కపరిచె" అని చెప్పెనని [[రాయవాచకము]] ఉటంకిస్తున్నది.<ref>Tidings of the king By Phillip B. Wagoner పేజీ.204 [http://books.google.com/books?id=nLYPejP-iE8C&pg=PA204&dq=gandikota+battle&lr=&client=firefox-a&sig=ACfU3U2bgZGCj0uDPl7vOWKSx1GffI6G_g]</ref> రామలింగ అనంతపూరు మండలములో పలు దేవాలయములు కట్టించెను.
 
రామలింగనాయుని తమ్ముడు పెద్దతిమ్మానాయుడు కూడ మహా యోధుడు. ఈతడు దస్తూరు ఖాను అను సేనాధిపతిని వధించి రాయలవారి అభిమానమునకు పాత్రుడయ్యెను.
"https://te.wikipedia.org/wiki/పెమ్మసాని_నాయకులు" నుండి వెలికితీశారు