కర్నూలు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

→‎ఆర్థిక రంగం: హోటళ్ళు, షాపింగ్ మాల్ లు చేర్ఛాను
బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
పంక్తి 37:
[[బాదామి చాళుక్యులు]], [[తెలుగు చోళులు]], [[కాకతీయులు]] ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత [[విజయనగర రాజులు]] ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. [[శ్రీకృష్ణదేవరాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన ''కొండారెడ్డి బురుజు'', [[అచ్యుతదేవరాయలు]] విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.
 
[[1565]]లో [[తళ్ళికోట యుద్ధం]]లో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత [[గోల్కొండ]] [[కుతుబ్ షాహీ సుల్తాన్]] కర్నూలును వశపరచుకొన్నాడు. [[1687]]లో [[ఔరంగజేబు]] కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్దీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. [[1733]]లో ఇక్కడి నవాబు హిమాయత్ ఖాన్, '''కర్ణాటక యుద్ధాలు'''గా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. [[1741]]లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, కర్నూలు వారి హయాంలోనికి వచ్చింది.
[[బొమ్మ:Abdul wahab khan tomb Kurnool.jpg|thumb|[[1618]]లో [[హంద్రీ నది]] ఒడ్డున నిర్మించిన అబ్దుల్ వహాబ్ ఖాన్ సమాధి<ref>http://asihyd.ap.nic.in/kurnool/index.htm</ref>]]
[[1751]] లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ ''బుస్సీ'' (పిల్లల పాటల్లోని ''బూచాడు'') కర్నూలును ముట్టడించారు. [[1755]] లో [[మైసూరు]]కు చెందిన [[హైదర్ అలీ]] ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. [[1799]]లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో [[టిప్పు సుల్తాన్]] మరణించగా అప్పుడు ఈ జిల్లా [[హైదరాబాద్]] [[నిజాం]] నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు. [[1928]] లో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, [[గాడిచర్ల హరిసర్వోత్తమ రావు]] ఇప్పటి [[రాయలసీమ]] అనే పేరు పెట్టాడు. ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు.
"https://te.wikipedia.org/wiki/కర్నూలు_జిల్లా" నుండి వెలికితీశారు