తళ్ళికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: id:Pertempuran Talikota
బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
పంక్తి 31:
 
 
విజయనగర సామ్రాజ్యం చాలా విశాలంగా ఉండేది. అంతేకాకుండా సిరి సంపదలతో తులతూగుతూ అపారమైన సైనిక సంపత్తి కలిగి ఉండేది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ అప్పట్లో లేదు. అందరు దక్కన్ సుల్తానులు కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే విజయనగరాన్ని జయించే అవకాశం ఉంది. విజయ నగరాన్ని జయించడానికి కూటమి ఏర్పాటుకు పూనుకోవాలని ఆదిల్‌షా సన్నిహితులు, సలహాదారులు ఆదిల్‌షా చెప్పారు. ఇంకో గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ సమయం లొ ఆలీ ఆదిల్‌షాకు, రామరాయలకు మధ్య మైత్రి ఉండేది. అయినప్పటికీ అతడు [[గోల్కొండ]] సుల్తాను ఇబ్రహీం కుతుబ్‌షా తో మంతనాలు చేశాడు. ఇబ్రహీం దానికి ఒప్పుకోవడమే కాక, ఆదిల్‌షా బద్ధ విరోధియైన అహ్మద్‌నగర్ సుల్తానుకు రాయబారం పంపి ఆలీ ఆదిల్‌ షా కు హుస్సేన్‌ షా మధ్య సంధి కుదిర్చాడు. ఈ సంధిలో భాగంగా హుసేన్‌షా కూతురు, చాంద్ బీబీ సుల్తానును ఆలీ ఆదిల్‌షా పెళ్ళి చేసుకోగా, ఆలీ ఆదిల్‌షా చెల్లెలు, బీబీ హదియా సుల్తానును హుసేన్‌షా కొడుకు, ముర్తాజాకిచ్చి పెళ్ళి చేసుకున్నాడు.<ref>Vijayanagara: History and Legacy S. Krishnaswami Aiyangar (ed.) Aryan Books International (2000) పేజీ.248</ref><ref>యుద్ధ సమయములో అలీ ఆదిల్‌షా వద్ద మంత్రిగా పనిచేసిన రఫీయుద్దీన్ షిరాజీ చెప్పిన వృత్తాంతము. మిర్జా ఇబ్రహీం జుబిరీ రాసిన ''బసతిన్-ఉస్-సలాతీన్'' నుండి అనువదించబడినది</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/తళ్ళికోట_యుద్ధం" నుండి వెలికితీశారు