చెత్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వర్గీకరణ}}
[[Image:Lixo.jpg|200px|thumb|right|Common rubbish in a [[bin bag]].]]
[[Image:Vuilnis.JPG|thumb|200px|A [[Dumpster (term)|dumpster]] full of waste awaiting disposal.]]
'''చెత్త''' (Waste or Garbage) పెద్ద [[సమస్య]]గా మారింది. రోజూ వేల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఖర్చుతోపాటు తరలింపునకు స్థలం కరవు ఔతోంది. చెత్తే కదా.. బయట పడేసిరా అని మనం తేలిగ్గా చెబుతాం. కానీ, మునిసిపాలిటీలకు అదే పెద్ద గుడిబండగా మారింది. మనం వేసిన చెత్తను ఎక్కడికి తరలించాలన్నది తలనొప్పిగా తయారైంది. దీనిని ఎక్కడ వేద్దామన్నా ఆ పరిసర ప్రాంతాల వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెత్త వేయటానికి అనువైన ప్రదేశం దొరకటం లేదు. ఫలితంగా డంపర్‌ బిన్లు నిండిపోయి వ్యర్థపదార్థాలు ఆ చుట్టుపక్కల పడుతున్నాయి. జనావాసాల మధ్య దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త వేయటానికి వెసులుబాటు లేక అధికారులు కూడా డంపర్ బిన్లు తీసుకెళ్లటం లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. భవిష్యత్తులో మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. చెత్తను తొలగించటానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. నగరంలో ఉన్న చెత్త తీసుకొచ్చి పోయటం వల్ల వ్యాధులు వస్తాయని ఎక్కడికక్కడ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉత్పత్తి అవుతున్న చెత్తను ఎక్కడ పోసినా తగాదాలు జరుగుతున్నాయి. చెత్తను నిర్వీర్యం చేయటం పెద్ద సమస్యే. వాస్తవానికి దానిని సేకరించిన తర్వాత సరైన పద్ధతిలో భూస్థాపితం చేయాలి. లేకుంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఉన్న ఖాళీలో పోసి వస్తున్నారు తప్పించి.. సరైన విధానాన్ని పాటించటం లేదు. దీంతో సమీప ప్రాంతాల్లో దుర్వాసన.. చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయి.
==చెత్తనుండి మేలు==
"https://te.wikipedia.org/wiki/చెత్త" నుండి వెలికితీశారు