జనమంచి శేషాద్రి శర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==జీవిత సంగ్రహం==
వీరు [[1882]] సంవత్సరంలో [[జూలై 4]]వ తేదీన [[నెల్లూరు జిల్లా]] కలువాయి గ్రామంలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో సుబ్రహ్మణ్యావధాని మరియు కామాక్షమ్మ దంపతులకు జన్మించారు. వీరి ప్రపితామహులు సూర్యనారాయణ సోమయాజి మరియు పితామహులు వేంకటావధాని. వీరి పెద్దల నివాసస్థానం కడప జిల్లా [[బద్వేలు]] తాలూకా వెంకటరాయపురం అగ్రహారం. కడపలో కొంతకాలం ఉద్యోగం చేసి తరువాత కాలంలో కాశీ, విజయనగరం, కసింకోట మొదలైన ప్రాంతాలలో సంచరించారు. వీరు చాలా శాస్త్రాలను పఠించారు. చాలా పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసి చివరిగా మునిసిపల్ ఉన్నత పాఠశాల, కడప లో పదవీ విరమణ చేశారు.
 
వీరికి 'బాలసరస్వతి', 'అభనవ ఆంధ్ర వాల్మీకి', 'ఆంధ్ర వ్యాస', 'కావ్యతీర్థ', 'కళాప్రపూర్ణ' మొదలైన బిరుదులు కలవు. వీరు చాలా సన్మానాలు పొందారు.<ref>[http://books.google.co.in/books?id=KnPoYxrRfc0C Encyclpopaedia of Indian Literature. ISBN:8126012218]</ref>