మూసీ నది: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గం
→‎వరదలు: మూసీనది చిత్రాలు జతచేసి ప్రస్తుత పరిస్థితి గురించి కొంత వ్రాశాను
పంక్తి 10:
 
నగారాభివృద్ధికి ప్రణాళికను తయారుచెయ్యటానికి నియమించబడిన సాంకేతిక నిపుణుడు [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]], వరదల పునరుక్తిని నివారించడానికి మరియు నగరంలో మౌళిక పౌర సౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909, అక్టోబర్ 1న తన నివేదిక సమర్పించాడు. [[ఉస్మాన్ ఆలీ ఖాన్|ఏడవ నిజాం]] 1912లో ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించాడు. వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించాడు. [[1920]]లో మూసీ నదిపై ఒక నగరానికి పది మైళ్ళ ఎగువన [[ఉస్మాన్ సాగర్]] ఆనకట్టను కట్టించారు. [[1927]]లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై [[హిమాయత్ సాగర్]] అనే మరో జలాశయము నిర్మించారు. ఈ రెండు జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడముతో పాటు హైదరాబాదు నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి.
 
==మురికి కాలువ మూసీ==
[[ఫైలు:Musi right2.jpg|left|thumb|చాదర్‌ఘాట్ వద్ద మూసీనది దృశ్యం. ఈ చిత్రాన్ని మలక్‌పేట నుండి కాచీగూడవైపు వెళ్ళే రైలుమార్గంలో మూసీపై ఉన్న రైలు వంతెన నుండి తీయబడినది. చిత్రంలో దగ్గరగా కనిపిస్తున్నది చాదర్‌ఘాట్ ప్రాంతంలో 1990వ దశకంలో కట్టిన వంతెన. దూరంగా కనిపిస్తున్నది అప్పటికే ఉన్న పాతవంతెన. పాతవంతెనను ఉత్తరంవైపు వెళ్ళే వాహానాలకు, కొత్తవంతెనను దక్షిణం వైపు వెళ్ళే వాహనాలకు ఉపయోగిస్తున్నారు]]
[[ఫైలు:Musi left3.jpg|right|thumb|ఈ దృశ్యంలో నందనవనం ప్రాజెక్టులో భాగంగా నది మధ్యలో నిర్మించిన కాంక్రీటు కాలువను చూడవచ్చు]]
1980వ దశకము నుండి హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలను మూసీ నదికి నీరును జతచేసే చిన్న చిన్న నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరించి. ఆ తరువాత 1990వ దశకంలో ఈ మురికినీటిని శుద్ధి పరచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్ పేట మొదలైన ప్రాంతాల్లో కలుషిత నీటి శుద్ధి ప్లాంట్లను ప్రారంభించారు. 2000లలో నగరంలో నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీటు కాలువ ద్వారా ప్రవహింపజేసి ఆ విధంగా సమకూరిన నదీతలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసేందుకై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మూసీ_నది" నుండి వెలికితీశారు