మూసీ నది: కూర్పుల మధ్య తేడాలు

→‎మురికి కాలువ మూసీ: కొన్ని మూలాలు
పంక్తి 14:
[[ఫైలు:Musi right2.jpg|left|thumb|చాదర్‌ఘాట్ వద్ద మూసీనది దృశ్యం. ఈ చిత్రాన్ని మలక్‌పేట నుండి కాచీగూడవైపు వెళ్ళే రైలుమార్గంలో మూసీపై ఉన్న రైలు వంతెన నుండి తీయబడినది. చిత్రంలో దగ్గరగా కనిపిస్తున్నది చాదర్‌ఘాట్ ప్రాంతంలో 1990వ దశకంలో కట్టిన వంతెన. దూరంగా కనిపిస్తున్నది అప్పటికే ఉన్న పాతవంతెన. పాతవంతెనను ఉత్తరంవైపు వెళ్ళే వాహానాలకు, కొత్తవంతెనను దక్షిణం వైపు వెళ్ళే వాహనాలకు ఉపయోగిస్తున్నారు]]
[[ఫైలు:Musi left3.jpg|right|thumb|ఈ దృశ్యంలో నందనవనం ప్రాజెక్టులో భాగంగా నది మధ్యలో నిర్మించిన కాంక్రీటు కాలువను చూడవచ్చు]]
1980వ దశకము నుండి హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలను మూసీ నదికి నీరును జతచేసే చిన్న చిన్న నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరించి. ప్రతిరోజూ జంటనగరాల నుండి వెలువడుతున్న 350 మిలియన్ లీటర్ల మురికినీరు మరియు పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలు నదిలో కలుస్తున్నవని అంచనా. ఆ తరువాత 1990వ దశకంలో ఈ మురికినీటిని శుద్ధి పరచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్ పేట మొదలైన ప్రాంతాల్లో కలుషిత నీటి శుద్ధి ప్లాంట్లను ప్రారంభించారు. 2000లలో నగరంలో నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీటు కాలువ ద్వారా ప్రవహింపజేసి ఆ విధంగా సమకూరిన నదీతలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసేందుకై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నందనవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీగర్భంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించారు. కానీ, మూసీ బచావ్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు మరియు రాజకీయ ప్రతిపక్షాలు మరియు వామపక్షాల వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు.<ref>http://www.hindu.com/2000/12/23/stories/04234036.htm</ref> ఈ మురికివాడల్లో 20 వేల మంది పైగా ప్రజలు ముప్పై ఏళ్లుగా నివసిస్తున్నారని అంచనా.<ref>http://www.hinduonnet.com/thehindu/2000/06/15/stories/0415403i.htm</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మూసీ_నది" నుండి వెలికితీశారు