తరంగము: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 1:
[[ఫైలు:2006-01-14 Surface waves.jpg|thumb|right|300px|[[నీరు|నీటి]] ఉపరితలంలో తరంగాలు.]]
యానకంలో ఏర్పడిన అలజడి (disturbance), యానక కణాల ఆవర్తన (periodic) చలనం వల్ల, ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రసారితమయ్యే ప్రక్రియను [[తరంగము]] ( wave) అని అంటారు. నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో, ఒక గులక రాయిని వేస్తే, అది పడిన చోట, వృత్తాకార తరంగాలు (అలలు) ఏర్పడడం మనం గమనిస్తాం. కంటికి చేరే కాంతి, చెవికి చేరే ధ్వని, రేడియో, టెలివిజన్, మొబైల్ ఫోన్లను చేరే వివిధ రకాల సంకేతాలు, వైద్య రంగంలో ఉపయోగించే ఎక్స్ కిరణాలు, సముద్ర అలలు మొదలైనవన్నీ తరంగాలే.
 
తరంగ ప్రసార ప్రక్రియలో యానక కణాలు, తమ మాథ్యమిక స్థానానికి రెండువైపులా కంపనం చేస్తాయి తప్ప తరంగంతో పాటు ముందుకు ప్రయాణించవు. శక్తికి ప్రతిరూపమైన అలజడి, ఒక కణం నుంచి మరో కణానికి బదిలీ అవుతూ ముందుకు సాగుతుంది. తరంగాలన్నీ శక్తిని జనక స్థానం నుండి ముందుకు తీసుకుని పోతాయి.
 
=== ఉదాహరణలు ===
"https://te.wikipedia.org/wiki/తరంగము" నుండి వెలికితీశారు