బ్రహ్మాండ పురాణం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bn, es, kn, lt, pl; cosmetic changes
పంక్తి 1:
'''బ్రహ్మాండ పురాణము''' (''Brahmanda Purana'') ఒక [[హిందూధర్మశాస్త్రాలు|హిందూ ధార్మిక గ్రంధము]]. ఇది ముఖ్యమైన [[అష్టాదశ పురాణములు|పురాణాలలో]] ఒకటి. సంఖ్యాపరంగా దీనిని 18వ పురాణంగా చెబుతారు. ఈ గ్రంధంలో [[ఆధ్యాత్మ రామాయణము]] అంతర్గతమై ఉంది.
 
బ్రహ్మ తెలిపిన విశ్వతత్వము (బ్రహ్మాండము) గురించి ఇందులో ఉన్నందున దీనికి "బ్రహ్మాండపురాణము" అనే పేరు వచ్చింది. ఇందులో విశ్వము లేదా సకల జగత్తు ఒక హిరణ్యమయమైన అండము (బ్రహ్మాండము) నుండి ఉద్భవించినట్లుగా తెలుపబడింది. ఆధ్యాత్మ రామాయణము, రాధాకృష్ణుల విశేషములు, పరశురామావతారము వంటి కధలు ఈ పురాణంలో ఉన్నాయి. ఇందులో మొత్తం 12,000 శ్లోకాలున్నాయి. ఒక బ్రాహ్మణునికి బహుమతిగా ఇవ్వడానికి ఇది ఉచితమైన గ్రంధమని చెబుతారు.
 
== ముఖ్యాంశాలు ==
 
వాయుదేవుడు తనకు చెప్పనట్లుగా తాను ఈ విషయాలను ఋషులకు చెబుతున్నానని సూతుడు ఈ పురాణంలోని విషయాలను తెలిపాడు.
 
=== యుగములు, వాని ప్రమాణములు ===
{{main|మన్వంతరము}}
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
పంక్తి 19:
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము). ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. పగలు గడిచిన తరువాత బ్రహ్మ విశ్రమించును. అప్పుడు సృష్టి నశించి ప్రళయం సంభవిస్తుంది.
 
=== యుగ ధర్మములు ===
కృతయుగంలో స్త్రీపురుషులంతా బహుచక్కనివారు, ఆరోగ్యవంతులు, దీర్ఘాయువులు, ధర్మకార్య తత్పరులు. దురాశ, దంభము, మచ్చరములెరుగరు. సద్యోగర్భమున సంతానము కంటారు. జనులు చెట్ల తొఱ్ఱలయందును, గుహలయందును, భూబిలంబులందును నివసింతురు. అందరిదీ ఒకే జాతి.
 
పంక్తి 30:
కలియుగంలో అసత్యము, హింస, అసహనము అతిశయించును. జనులకు రోగబాధలు, ఈతి బాధలు అధికమగును. దుర్వృత్తులు అవలింబింతురు. వ్యభిచారము పెరుగును. జనులందరు వర్తకముపైనే అత్యధికంగా ఆసక్తి చూపెదరు. పుణ్యకార్యఫలితములు అమ్ముకొనసాగెదరు. అతిధి అభ్యాగత ఆదరణ నశించును. జనులు అల్పాయుష్కులగుదురు. ప్రజలకు ఆయువు తక్కువ అగుట వలన కొద్దిపుణ్యకార్యములకే అధిక ఫలములు లభించునట్లు భగవంతుడు చేయును. త్రేతాయుగంలో తపమువలన జనించిన ఫలము ద్వాపరంలో ఒక్క మాసమునందు, కలియుగంలో ఒక్కరోజునందు లభించును.
 
=== రాక్షసులు సూర్యుని అడ్డగించుట ===
ప్రళయకాలంలో జలార్ణవంలో మునిగిన భూమిని తేల్చుటకై జలములనింకించుటకు ఆదిపరబ్రహ్మమూర్తి సూర్యభగవానుని సృజించెను. ఇలా ఉండగా మందేహాసురులనే రాక్షసులు మూడుకోట్లమంది సూర్యుని కిరణాలను మింగివేస్తూ ఉదయాస్తమయకాలాలలో సూర్యుని నిరోధింపసాగారు. అప్పుడు ఆదిత్యునకు, ఆ రాక్షసులకు యుద్ధాలు జరిగేవి. ఋషులు, మునులు గాయత్రిని జపించి బ్రహ్మాస్త్రముగా చేసి, అర్ఘ్యప్రదానము అనే వింట సంధించి ఆ రాక్షసులను నిర్జింపడానికి సహాయపడ్డారు. తరువాత సూర్యకిరణములు నిరాటంకంగా ప్రసరిస్తున్నాయి.
 
పంక్తి 39:
* ఇలా దినానికి పగలు 15 ముహూర్తములు, రాత్రి 30 ముహూర్తములు ఉంటాయి.
 
=== వాలి వృత్తాంతము ===
 
=== శ్రాద్ధక్రియ, విమర్శనదినము ===
 
=== మృగమృగీ సంవాదము ===
 
=== పరశురాముడు, గోకర్ణ క్షేత్రము ===
 
=== స్వాయంభువు మనువు సంతతి ===
 
=== జల స్థల విభాగము ===
 
=== విశ్వే దేవతలు ===
 
=== అశ్వినీ దేవతలు ===
 
=== వైవస్వత మనువు ===
 
=== సుద్యుమ్నుడు ===
 
=== ధన్వంతరి ===
 
=== కాశీపుర నిర్మాణము ===
 
=== విష్ణువునకు భృగుశాపము ===
 
=== జయంతి, శుక్రుడు, బృహస్పతి ===
 
== ఇవి కూడా చూడండి ==
* [[పరశురామావతారము]]
* [[ఆధ్యాత్మ రామాయణము]]
పంక్తి 74:
* [[ధన్వంతరి]]
 
== మూలాలు, వనరులు ==
{{మూలాలజాబితా}}
 
* '''అష్టాదశ పురాణములు''' - (18 పురాణముల సారాంశము) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)
 
== బయటి లింకులు ==
 
 
పంక్తి 88:
 
[[en:Brahmanda Purana]]
[[kn:ಬ್ರಹ್ಮಾಂಡ ಪುರಾಣ]]
[[bn:ব্রহ্মাণ্ড পুরাণ]]
[[es:Brahmāṇḍa purāṇa]]
[[lt:Brahmanda Purana]]
[[pl:Brahmandapurana]]
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మాండ_పురాణం" నుండి వెలికితీశారు