చారు మజుందార్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: mr:चारू मुजुमदार
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Мазумдар, Чару; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[బొమ్మఫైలు:CharuMazumdar183_262.jpg|thumb|చారు మజుందార్]]
సి.ఎం. గా సుప్రసిద్ధుడైన '''చారు మజుందార్''', [[నక్సలైటు]] నాయకుడు, [[నక్సల్బరీ]] ఉద్యమ రూపశిల్పి. [[CPI(ML)]] పార్టీకి సంస్థాపక ప్రధాన కార్యదర్శి. ఆయన ప్రేరణ వల్ల ఎంతో మంది యువకులు విప్లవోద్యమంలో చేరారు. కార్మికులతో, కర్షకులతో అనుసంధానమై వాళ్ళ పోరాటాలలో పాల్గొన్నవారే చివరిదాకా [[విప్లవకారులు]]గా నిలబడగలుగుతారని ఆయన యువతకి చెప్పాడు. ఆయన మరణించిన [[జూలై 28]]వ తేదీని భారతదేశంలోని [[మార్క్సిస్టు]]-[[లెనినిస్టు]]లు అమరవీరుల దినంగా పాటిస్తారు.
 
 
== బాల్యం ==
చారు మజుందార్ [[1918]] ల [[సిలిగురి]]లోని ఒక జమీందారు కుటుంబంల జన్మించిండు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన పెట్టి-బూర్జువా జాతీయ విప్లవకారులచే ప్రభావితుడై [[అనుశీలన్]] గ్రూపుకి అనుబంధ సంస్థ అయిన [[బెంగాల్]] విద్యార్థి సంఘంల (All Bengal Students Association) సభ్యునిగా చేరిండు. న్యాయవాది అయిన ఆయన తండ్రి [[కాంగ్రెస్‌]]ల చురుకైన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన తల్లి ఆమె కాలానికి ప్రగతిశీల భావాలు కలది. [[1937]]-[[1938|38]] ల ఆయన కళాశాల విద్యను వదిలిపెట్టి, [[కాంగ్రెస్]] కార్యకర్తగా బీడీ కార్మికులను, ఇతరులను సంఘటిత పరిచిండు.
 
== [[CPI]] ల ==
కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ని వదిలిపెట్టి [[CPI]]ల చేరి రైతు సంఘంల పని చేసిండు. మొదట [[జల్‌పైగురి]] రైతులతో పని చేసి వారిల సర్వసమ్మతమైన నాయకునిగా పేరు తెచ్చుకున్నడు. ప్రభుత్వం ఆయన మీద అరెస్టు వారెంటు జారీ చేయగా ఆయన అజ్ఞాతంలకి వెళ్ళిండు. [[రెండవ ప్రపంచ యుద్ధం]] మొదలవ్వంగనే [[CPI]] పార్టీ నిషేధించబడింది. రైతులతో రహస్య కార్యకలాపాలు నిర్వహించి, [[1942]] ల [[CPI]] జల్‌పైగురి జిల్లా కార్యవర్గంల సభ్యుడయ్యిండు. [[1943]] ల పెద్ద కరువు వచ్చినపుడు, జల్‌పైగురిల పంటలను స్వాధీనపర్చుకోడానికి అందరినీ సంఘటితపరిచిండు. [[1946]]ల '[[తెభాగ]] ' ఉద్యమంల పాల్గొని, ఉత్తర [[బెంగాల్]] రైతు పోరాటాలను నిర్వహించిండు. ఈ ఉద్యమం ఆయనపై ప్రగాఢ ప్రభావం చూపి, సాయుధ రైతాంగ విప్లవోద్యమంపై ఆయన ఆలోచనలకు స్పష్టతనేర్పరచింది. తర్వాత ఆయన [[డార్జిలింగ్]] జిల్లాల తేయాకు కార్మికులతో పని చేసిండు.
 
పంక్తి 14:
[[1984]]ల [[CPI]] నిషేధించబడగా ఆయన తర్వాతి మూడు సంవత్సరాలు జైలుల గడిపిండు. [[1954]] జనవరిల జల్‌పైగురికి చెందిన [[CPI]] సభ్యురాలు లీల మజుందార్ సేన్‌గుప్తను ఆయన వివాహమాడిండు. ఆయన కార్యకలాపాలకు కేంద్రమైన [[సిలిగురి]]కి వాళ్ళు వెళ్ళింరు. పూర్వీకుల ఆస్తి పోగొట్టుకొని అనారోగ్యంతో ఉన్న ఆయన తండ్రి, అవివాహిత అయిన ఆయన చెల్లెలు ఆర్థిక ఇబ్బందుల మధ్య అక్కడే జీవించింరు. రైతాంగ పోరాటం తగ్గుముఖం పట్టడంతో తేయాకు కార్మికులు, రిక్షా కార్మికులను సంఘటితపర్చడానికి ఆయన కృషి చేసిండు. [[1956]]ల [[పాల్‌ఘాట్]] కాంగ్రెస్ తర్వాత, పార్టీతో ఆయనకున్న అభిప్రాయ భేదాలు పెరిగినయి. ఆయనకున్న ఇబ్బందికర పరిస్థితులకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తోడైనయి. కాని అంతర్జాతీయ [[కమ్యూనిస్టు]] ఉద్యమంల జరుగుతున్న పెద్ద చర్చ (The Great Debate) ఆయనకు ఉత్తేజాన్ని ఇచ్చింది. [[ఇండో-చైనా]] యుద్ధం సందర్భంగా ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళిండు.
 
== [[CPI(M)]] ల ==
[[CPI]] పార్టీ చీలికతో [[CPI(M)]]ల చేరినా, ముఖ్యమైన సైద్ధాంతిక ప్రశ్నలపై నాయకత్వం తప్పించుకుంటునట్టు ఆయన భావించిండు. [[1964]]-[[1965|65]] ల ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు [[కమ్యూనిజం]] మరియు [[మావో]] ఆలోచన గురించి అధ్యయనం చేయడానికి, రాయడానికి సమయాన్ని వినియోగించిండు. [[1965]]-67 వరకు ఆయన రచనలల్ల, ఉపన్యాసాలల్ల నమోదు చేయబడిన ఆయన భావాలు ఈ సమయంలనే ఏర్పడ్డయి. అవే తర్వాత '''చారిత్రక ఎనిమిది పత్రాలు'''(Historic Eight Documents)గా పిలువబడి నక్సల్బరి ఉద్యమానికి రాజకీయ-సైద్ధాంతిక మూలం అయినయి.[[1967]]ల [[నక్సల్బరీ]] ఉద్యమం మొదలైన తర్వాత పోలీసులకి పట్టుబడకుండా [[చారు మజుందార్]] అజ్ఞాతంలకి పోయిండు. కొన్ని వారాల తర్వాత ఆయన ఇట్లా రాసిండు, "వందలాది [[నక్సల్బరీ]]లు భారతదేశంల నిప్పు రాజుకుంటున్నయి...నక్సల్బరీ చావలేదు,నక్సల్బరీకి చావు లేదు."
 
== [[CPI(ML]]) ఏర్పాటు ==
[[మార్క్సిజం]]-[[లెనినిజం]]-[[మావో]] ఆలోచనను వ్యాపింపజేస్తూ, దీని మూలంగా అన్ని [[కమ్యూనిస్టు]] విప్లవకారులను ఏకం చేస్తూ, నక్సల్బరీ తరహా రైతాంగ విప్లవ పోరాటాలను వృద్ధి చేసే లక్ష్యంతో ఏప్రిల్ [[1969]] లో [[CPI(ML)]] ఏర్పడింది. మే [[1970]], [[CPI(ML)]] కాంగ్రెస్ సమావేశంల ఏర్పడిన కేంద్రకమిటీకి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. తర్వాత కాలంలో ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు మాయం చేయబడినా, చాలా మంది ముఖ్య నాయకులు చంపబడినా, అనారోగ్యంతో ఉన్న ఆయన పోలీసులనుండి తప్పించుకోగలిగాడు.
 
== పోలీసు నిర్బంధంల మరణం ==
[[జూలై 16]], [[1972]]న, కొరియర్‌ని చిత్రహింసలు చేయగా తెలిసిన సమాచారంతో ఆయన [[కలకత్తా]]లోని ఒక స్థావరంలో పట్టుబడ్డాడు. పట్టుబడిన సమయంలో ఆయన గుండెజబ్బు వలన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పోలీసు నిర్బంధంలో ఆయన ఉన్న పది రోజులు ఆయనను చూడడానికి ఆయన న్యాయవాదిని కాని, కుటుంబ సభ్యులని కాని, వైద్యున్ని కాని పోలీసులు అనుమతించలేదు. [[1972]] జూలై 28 తెల్లవారుఝామున 4 గంటలకు, [[చారు మజుందార్]] [[లాల్‌బజార్]] పోలీస్ నిర్బంధంలో మరణించాడు. ఆయన శవాన్ని కూడా ప్రభుత్వం కుటుంబానికి అందజేయలేదు. పోలీసులు కుటుంబ సభ్యులతో శవాన్ని ఒక దహనవాటికకు తీసుకపోయి, సమీప బంధువులను కూడా రానివ్వకుండా కట్టుదిట్టం చేసి ఆయన శవాన్ని దహనం చేశారు. ఆయన మరణంతో [[భారత దేశము]]లో విప్లవోద్యమ మొదటి ఘట్టం ముగిసింది.
 
పంక్తి 32:
[[ml:ചാരു മജൂംദാര്‍]]
[[mr:चारू मुजुमदार]]
[[ru:Чару Мазумдар, Чару]]
[[sv:Charu Majumdar]]
"https://te.wikipedia.org/wiki/చారు_మజుందార్" నుండి వెలికితీశారు