వేట: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 8:
వేట మూలంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అందువలన ఆధునిక కాలంలో జీవులను వేటాడడం చాలా దేశాలలో చట్టరీత్యా నిషేధించడం జరిగినది. [[జాలరి]] వాళ్ళు నదులు మరియు సముద్ర జలాల్లో [[చేప]]లను ఆహారం కోసం [[వల]]ల సహాయంతో పట్టుకోవడం లేదా చంపడం కూడా వేట కిందకే వస్తుంది.
సాధారణంగా [[జింక]]లను, [[పంది|పందులను]] మాంసం కోసం వృత్తి రీత్యా వేటాడుతారు. పులులు, సింహాలు, ఏనుగులను వినోదం కోసం వేటాడుతారు. ఏనుగులు చాలా బలమైన జంతువులు కాబట్టి వీటికోసం ప్రత్యేకంగా కందకాలు త్రవ్వుతారు.
 
హిందూ పురాణాలైన [[రామాయణం]], [[మహాభారతం]] లో రాజులు వేటాడటం సాంప్రదాయంగా పేర్కొనడం జరిగింది. వేటాడటం లేదా మాంసం తినడం జైనమతంలో నిషేధం. ఎందుకంటే అన్ని జీవాలను సమానంగా చూడాలని జైనం ప్రభోదిస్తుంది. బౌద్ధం లో కూడే ఇదేరకమైన సాంప్రదాయం అమల్లో ఉంది.
 
[[న్యూజీలాండ్]] కు వేటకు సంబంధించి బలమైన చరిత్ర ఉంది. భారత దేశంలో భూస్వామ్య వ్యవస్థ, వలసవాదుల పరిపాలనలో ఉన్నపుడు వేటను ఒక ఆటగా భావించేవాళ్ళు. ప్రతీ మహారాజు లేదా జమీందారు దగ్గర కొద్ది మంది వేటగాళ్ళు ఉండేవాళ్ళు. వీరిని షికారీలు అని పిలిచేవారు. వీరు జన్మత: వేటను వంటబట్టించుకున్న వాళ్ళు. వీళ్ళని మామూలుగా ప్రాంతీయంగా నివసించే కొన్ని తెగల నుండి ఎంచుకునేవారు. వీరికి వేటాడటంలో ఎన్నో సాంప్రదాయకమైన మెళుకువలు తెలిసి ఉండేవి.
 
 
"https://te.wikipedia.org/wiki/వేట" నుండి వెలికితీశారు