"స్థానం నరసింహారావు" కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా [[నవరసాలు]] కలిగిన పాత్రలను పోషించి ప్రతిభావంతంగా పండింఛారు. వేషధారణ మరియు వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా రంగస్థానం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశేవారు.
 
వీరు సినీ రంగంలో [[రాధాకృష్ణ (సినిమా)|రాధాకృష్ణ]] (1939), [[సత్యభామ (1942 సినిమా)|సత్యభామ]] (1942) వంటి కొన్ని సినిమాలలో నటించారు.
 
స్థానం [[1971]] [[ఫిబ్రవరి 21]] తేదీన మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/453660" నుండి వెలికితీశారు