తైత్తిరీయోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
== బ్రహ్మవల్లి==
బ్రహ్మవల్లి, భృగువల్లి ప్రశ్నములను [[వారుణి]] అంటారు. బ్రహ్మవిద్యాసాంప్రదాయ ప్రవర్తకుడైన వరుణిని సంబంధముచేత ఈ రెండు ప్రశ్నములకు వారుణి అని పేరు వచ్చింది.<br />
బ్రహ్మవల్లి లేదా ఆనందవల్లి అనబడే ఈ ప్రశ్నమునందు బ్రహ్మ విద్యకు ప్రయోజనము అవిద్యా నివృత్తియని, అవిద్యానివృత్తిచేత జనన మరణ రూపమైన సంసారము నిశ్శేషముగా నశించునని ప్రతిపాదించబడినది.<br />
ఈ ప్రశ్నములోనే
<poem>ఓం సహనావవతు | సహనౌ భునక్తు | సహవీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై | ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః | <poem>అనే శాంతి మంత్రము ఉన్నది.
 
== భృగువల్లి ==
భృగుమహర్షి తన తండ్రి అయిన వరుణుని బ్రహ్మను గూర్చి తెలుపవలసినదిగా ప్రార్థించాడు. వరుణుడు తన కుమారుని జిజ్ఞాసకు ప్రీతి చెంది, అన్నము, ప్రాణము, చక్షుస్సు, శ్రోతము, మనస్సు, వాక్కు అనునవి బ్రహ్మప్రాప్తికి ద్వారభూతములని చెప్పి, బ్రహ్మము యొక్క లక్షణమును కూడా భృగువునకు ఉపదేశించెను.ఇది స్థూలముగా భృగువల్లి సారాంశము.