పొదుపు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sh:Štednja
పంక్తి 19:
 
== వ్యక్తిగతమైన పొదుపు ==
భవిష్యత్తు అవసరాల కొరకు ప్రస్తుత ఆదాయం నుంచి కొంత భాగం ఖర్చుచేయకుండా దాచిపెట్టడమే పొదుపు అయినప్పటికీ ద్రవ్యోల్బణం వలన దాని విలువ క్రమక్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి సాధారణంగా వడ్డీ లభించే డిపాజిట్ రూపంలో భవిష్యత్తు వినియోగాలకై బ్యాంకులలో నిల్వ చేస్తుంటారు. కొందరు వ్యక్తులు తమ ఆదాయంలో పెట్టుబడి పథకాలైన షేర్లు కొనడానికి డబ్బు వినియోగిస్తారు. కాని అందులో పెట్టుబడి నష్టభయం ఉంటుంది. నగగుగా పొదుపుచేయడానికి, షేర్లలో పెట్టుబడి రూపంలో పొదుపు చేయడానికి ఈ కారణమే వ్యక్తులను నిర్దేశిస్తుంది. తక్కువ ఆదాయం కలవారు నగదు రూపంలోనే పొదుపు చేస్తుంటారు. కాని ద్రవ్యోల్బణం సమయంలో వడ్డీరేటు కంటే ద్రవ్యోల్బణం రేటు అధికంగా ఉంటే వారి పొదుపు నికర విలువ తగ్గుతుంది లేదా బ్యాంకు సంక్షోభం వచ్చినప్పుడు కూడా వారు నష్టపోవలసి వస్తుంది. చాలా సంధర్బాలలో పొదుపు మరియు పెట్టుబడి పదాలను ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడడానికి ఇలాంటి స్థితే కారణం. ఉదాహరణకు: చాలా డిపాజిట్ అక్కౌంట్లు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం చేయడానికి పెట్టుబడి అక్కౌంట్లుగా ఉపయోగపడుతున్నాయి. వ్యక్తులు చేసిన పొదుపు ఆర్థిక సంస్థల ద్వారా పెట్టుబడి రూపంలో ఆర్థికవ్యవస్థలో ప్రవేశిస్తుంది.
==ఒక్కరే చాలు లేదా అసలే వద్దు ==
 
ఓవైపు ఆర్థికమాంద్యం..మరోవైపు పెరుగుతున్న ధరలు...సంతానం విషయంలోనూ ‘పొదుపు’ పాటించేలా చేస్తున్నాయి. ఖర్చు తగ్గాలంటే ఒక్క సంతానం చాలని కొత్త దంపతులు భావిస్తున్నారు. పెళ్లైన కొత్తలోనే పిల్లలు కావాలనుకునే వారు సైతం మూడేళ్ల తర్వాత చూద్దాంలే అన్న అభిప్రాయానికి వచ్చేశారు.మరికొందరు ఖర్చులకు భయపడి అసలు పిల్లలే లేకున్నా ఫర్వాలేదన్నట్లుగా ఉన్నారు. పిల్లల ఆలన, పాలన కష్టమన్న భావనతో ఒక్కరితో సరి పెట్టుకుంటున్నారు.ఒకరికంటే ఎక్కువ పిల్లలు పుడితే వారి పెంపకం కష్టమవడంతో పాటు.. వారికోసం ఎక్కువ సెలవులు పెడితే జీతంలో కోత పడుతుందన్న భయంతో చాలామంది ముందుచూపుతో వ్యవహరి స్తున్నారు.ఆర్థికమాంద్యం, ఉద్యోగాల్లో కోత, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఇంటి అద్దెల మోత, స్కూలు ఫీజులు ఇతర కారణాలు ప్రతి ఒక్కరి జీవితంపైనా ప్రభావం చూపుతున్నాయి.సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు పోయి అప్పుల బాధపడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘ టనలూ ఇటీవలికాలంలో పెరుగుతున్నాయి.ఒక సంతానం ఉంటేనే భారంగా ఇల్లు గడుస్తున్న తరుణంలో రెండో సంతానం వద్దంటే వద్దన్న భావనతో చాలామంది ఉన్నారు. కుటుంబ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం వస్తోంది.గతంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు కావాలనుకునేవారు సైతం ప్రస్తుతం ఆడైనా, మగైనా ఒక్కరు చాలన్న భావనకు వచ్చేశారు. చిన్నకుటుంబం నినాదం గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది.బాలికల సంఖ్య తగ్గుముఖం పడుతోందని గగ్గోలు పెడుతున్నా స్ర్తీలు సైతం మగపిల్లలే కావాలని కోరుకుంటున్నారు. సమాజంలో మహిళలపై పెరుగుతున్న, జరుగుతున్న దారుణాల నేపథ్యంలో చాలామంది తమకు ఆడపిల్లలు వద్దని స్పష్టంగా చెబుతున్నారు. ఆడ శిశువు అని తెలిసిన క్షణాల్లోనే తమకు అబార్షన్‌ చేయమని వైద్యులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.అద్దె ఎక్కువ చెల్లిస్తేనే ఇళ్లు దొరికే పరిస్థితి ఉంది. దీంతో ఎక్కువ సంతానం ఉంటే ఖర్చులు పెరుగుతాయన్న ఆలోచనతో ఒకరితో సరిపెట్టుకుంటున్నారు.http://www.suryaa.com/showStateNews.asp?ContentId=14953
చాలా సంధర్బాలలో పొదుపు మరియు పెట్టుబడి పదాలను ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడడానికి ఇలాంటి స్థితే కారణం. ఉదాహరణకు: చాలా డిపాజిట్ అక్కౌంట్లు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం చేయడానికి పెట్టుబడి అక్కౌంట్లుగా ఉపయోగపడుతున్నాయి. వ్యక్తులు చేసిన పొదుపు ఆర్థిక సంస్థల ద్వారా పెట్టుబడి రూపంలో ఆర్థికవ్యవస్థలో ప్రవేశిస్తుంది.
 
== వడ్డీ రేటులు ==
"https://te.wikipedia.org/wiki/పొదుపు" నుండి వెలికితీశారు