ఎస్.పి.కోదండపాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
అతని బాల్యం [[గుంటూరు]]లో గడిచింది. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. [[అద్దేపల్లి రామారావు]] గారి [[నా ఇల్లు]] చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణాముర్తి]] గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. [[1955]]లో [[సంతానం]] చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత కె.వి.మహదేవన్ వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగారు.
 
హాస్యనటులు [[పద్మనాభం]] రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవారు. వారికి సంగీత దర్శకులుగా సేవలందించారు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్టల వల్ల 1961లో కన్నకొడుకు (1961) చిత్రానికి సంగీత దర్శకులయ్యారు. తరువాత పదండి ముందుకు (1962), మంచి రోజులొచ్చాయి, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, లోగుట్టు పెరుమాళ్ళకెరుక మొదలైన చిత్రాలకు పనిచేశారు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవారు.
 
[[పద్మనాభం]] గారి [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రం ద్వారా వీరు 1967లో ఈనాటి ఉత్తమ గాయకులు [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] ను తెలుగు తెరకు పరిచయం చేశారు.
 
==చిరకాలం గుర్తుండే పాటలు==
* బొమ్మను చేసి ప్రాణం పోసి - [[దేవత]]
* ఇది మల్లెల వేళయనీ - [[సుఖదుఃఖాలు]]
* జగమే రామమయం - [[శ్రీరామకథ]]
* చుక్కలన్ని చూస్తున్నాయీ - [[జ్వాలాద్వీప రహస్యం]]
 
==చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎస్.పి.కోదండపాణి" నుండి వెలికితీశారు