శ్రీకృష్ణాంజనేయ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

→‎చిత్రకథ: బొమ్మ చేర్చాను
పంక్తి 13:
ఈ సినిమా 1972 లో విడుదలయ్యింది. లవకుశ చిత్రం పుల్లయ్య గారి మరణానంతరం దర్శకత్వం వహించిన వారి కుమారుడు సి.ఎస్.రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పౌరాణికాలను సీక్వెల్స్ గా ఆమోదించగలితే ఈ చిత్రం తొలిభాగం లవకుశకు కొనసాగింపుగా ఉంటుంది.
==చిత్రకథ==
[[ఫైలు:TeluguFilm SriKrishnanjaneyaYuddham.jpg|left|rhumb|350px|సినిమాలో కొన్ని సన్నివేశాలు]]
సీతాదేవి భూమాతలో లీనమైన తరువాత, రాముడు సీతా వియోగాన్ని భరింపలేక శొకతప్తుడౌతాడు. అయోధ్య లో ఉన్న హనుమ శ్రీరాముని ఆస్థితి లో చూడలేక పోతాడు. ఆసమయంలో దూరంగా వేదోచ్ఛాటన చేస్తున్న భూసురుడు తన వేదన తగ్గించగలడని, ఆతని తోడ్కొని రమ్మని హనుమ కు శ్రీరాముడు చెబుతాడు. వచ్చిన భూసురుడు ఒక షరతు పెడతాడు. తాను రామునితో ఏకాంతంగా సంభాషించాలని ఆఏకాంతాన్ని ఎవరు భంగంచేసినా శిరచ్చేధం చేయాలని ఆ షరతు. రాముడు అంగీకరించి హనుమను తన ద్వారంవద్ద కావలి ఉంచాడు. వచ్చిన బ్రాహ్మణుడు యమధర్మరాజు. రాముని అవతార పరమార్ధం సిద్ధించింది కావున వైకుంఠానికి తిరిగి రమ్మని చెబుతాడు. ఐతే శ్రీరామునికి భూలోకంలో ఉన్న బంధం హనుమ పై ఉన్న ప్రేమ. ఆ ప్రేమరాహిత్యాన్ని సాధించాలంటే శ్రీరామ హనుమలు దూరమవ్వాలి. ఈ ఏకాంత సంభాషణ జరుగుతున్న కాలంలో దూర్వాసుడు శ్రీరాముని చూడాలని వస్తాడు. వారించిన హనుమ తో రఘు వంశాన్ని శపిస్తానని బెదిరిస్తాడు. గత్యంతరం లేని స్థితిలో హనుమ లోనికి వెళతాడు. ఫలితంగా శిరచ్ఛేధానికి సమమైన రాజ్య బహిష్కారానికి గురై గంధమాదన పర్వతంపై రాముని భజిస్తూ కాలంగడుపుతాడు. శ్రీరాముడు అవతారం చాలించి కృష్ణావతారం ధరించాడు. వైకుంఠంలో గరుత్మంతుడు, భూలోకంలో బలరాముడు, సత్యభామ గర్వోన్మత్తులై ఉండటం గమనించి నారదుడు వారందర్నీ హనుమపైకి ఉసికొల్పుతాడు. వారందరూ హనుమని ఎదుర్కొని శృంగభంగం పొందుతారు. హనుమంతుడు చివరగా కృష్ణుని చూడటానికి ద్వారకకు వస్తాడు. అక్కడ రుక్మిణి ని సీతగా గుర్తించి, కృష్ణుని కూడా రాముడి గా అంగీకరించగలుగుతాడు.