బలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==జీవహింస==
*అన్ని మతాలలో బలులున్నాయి.బలి అనేది ఒక మూఢనమ్మకం.ఊళ్లో పశువులకు జబ్బులు తగులుతున్నాయి. వీటికి క్షుద్రదేవతలు కారణమని, ఆ దేవతల్ని వూళ్లోకి రాకుండా చెయ్యలంటే బలులివ్వాలంటారు.మేకను ఒక పెద్ద రాయి మీద మెడ ఆనేటట్టు పట్టుకుని ఒక్క దెబ్బతో తలనరుకుతారు. పందితల మాత్రం బయట కుండేటట్టు పాతేసి,గేదెలు, ఎద్దులు, గిత్తలు, దూడలు,ఆవుల చేత తొక్కిస్తారు.పంది ముట్టెమీద పశువులు పడటంతో గింజుకుంటుతల పక్కకి వాలి ఘోరంగా నెత్తురు కారుతూ చనిపోతుంది.
==బలులు మహాపాపం==
దేవతల[[జాతర]] లో మూగజీవుల[మేకపోతుల] గొంతుకొరికి నరికి చంపుతారు.ఇది తామసిక మనస్తత్వం .భగవంతునికి ఈబలి వల్ల ప్రీతి కలుగుతుందనే [[మూఢనమ్మకం ]] .ఒక [[కాపాలికుడు]] [[కాళీ మాత]] ను ప్రసన్నం చేసుకోవాలని 100 గొర్రెపొటేళ్లను బలియివ్వాల నే ప్రయత్నం మొదలు పెట్టి 99 పొట్టేళ్ళను బలిచ్చాడు.చివరగా 100వ బలికి సిద్ధమయ్యాడు. ఒక గొర్రెపొటేలును కొని తెచ్చి దానిని పూజించి బలికి సిద్ధపరచి తన పూజా కార్యక్రమాన్ని సాగిస్తున్నాడు. అంతలో పకపకా నవ్విన శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే ఏమీ కనిపించలేదు. మరలా పూజలో నిమగ్నమయాడు. మరలా నవ్వు ఆతర్వాత పెద్దగా ఏడ్పువినిపించింది. ఏమిటా అని భయంతో చూడగా గొర్రెపొటేలు పెద్దగా ఏడుస్తూకనిపించింది. భయంతో బిక్కచచ్చిన కాపాలికుడు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. ఆగొర్రె నవ్వు ఏడుపు ఆపి నేనూ ఒక జీవినే అన్నది. అయ్యా మీరెవరు? గొర్రెమాట్లాడటం ఏమిటి? నిజంచెప్పండి అన్నాడు . నాయనా నేనూ పూర్వజన్మలో ఒక కాపాలికుడనే అని అన్నదా గొర్రె. అలాగా మరయితే మీరు ఇలా ఎందుకున్నారు? ముందు నవ్వారు మరలా ఏడ్చారు ఎందుకు? అని ప్రశ్నించాడు . నేనుకూడా నీలాగనే ఎవరో చెప్పిన మాటను విని 100 పొట్టేళ్ళను కాళీమాతకు బలిస్తే అమ్మ అనుగ్రహిస్తుందని నమ్మి బలి కార్యక్రమం పూర్తి చేసాను. కాళీ మాత అనుగ్రహము కలగలేదుగానీ మహా పాపంచుట్టుకున్నది. దానివలన ఇప్పటికి 100 సార్లు గొర్రె జన్మమెత్తాను. 99సార్లు నరికి చంపబడ్దాను. ఖర్మ ఫలితం అనుభవిస్తున్నాను. ఇది చివరి జన్మ కనుక దీనినుండి విముక్తమవుతున్నాననే ఆనందం వలన నవ్వు వచ్చింది. త్వరగాబలి ముగించినన్ను ఈపాపమునుండి విముక్తం చేయమనికోరింది. కాపాలికునికి తాను చేసిన పాపం గుర్తుకువచ్చి గడగడ లాడాడు.
 
==[[యుద్ధం]] అంటే [[నరబలి]] ==
"https://te.wikipedia.org/wiki/బలి" నుండి వెలికితీశారు