నాగార్జునకొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
కొంతకాలం తర్వాత ఈ ప్రాంతము [[కాకతీయులు|కాకతీయుల]] పాలనలోకి వచ్చినది. కాకతీయులలో ప్రోలరాజు కుమారుడు బేతరాజు అనుమకొండలో శివాలయాన్ని నిర్మించాడు. కాకతీయుల అనంతరం ఈ ప్రాంతం కొద్దికాలం [[ఢిల్లీ]] సుల్తానుల పాలనలో ఉన్నది.
 
[[కొండవీడు]] రాజధానిగా పాలించిన రెడ్డి రాజుల కాలంలో ఈ ప్రాంతం లో నాగార్జునగిరి దుర్గాన్ని నిర్మించి వారి రాజ్యానికి చెందిన సైనిక స్థావరాలలో దక్షిణ దుర్గంగా ఉంచారు. తర్వాత [[గజపతులు]] నాగార్జునకొండను వశపరచుకొని వారి ప్రతినిధిని ఉంచారు. పురుషోత్తమ గజపతి కాలంలో ఈ ప్రాంతం అతని ప్రతినిధి శ్రీనాథ రాజసింగరాయ మహాపాత్రుని ఆధీనంలో ఉన్నది. వీరు 1413లో ఇక్కడ నాగేశ్వరలింగ ప్రతిష్ఠ చేశారు.
 
క్రీ.శ. 1513 నుండి 1519 వరకు శ్రీకృష్ణదేవరాయల కళింగ దండయాత్ర జరిగింది. ఉదయగిరితో మొదలైన ఈ దండయాత్ర కందుకూరు, వినుకొండ, అద్దంకి, కవుతారం, తంగెడ, నాగార్జునకొండ, బెల్లంకొండ వరకు సాగింది. రాయలు గజపతుల సైనిక స్థావరాన్ని నిర్మూలించి వశం చేసుకున్నారు. నాగార్జునకొండలో అయ్యలయ్య, వీరభద్రయ్య అనే సానాధిపతులను ఉంచాడు. వీరు నాగార్జునకొండను రాజకీయ పాలనాకేంద్రంగా చేశారు. నాగార్జునకొండ పేరు మొదటిసారిగా వీరి శాసనాలలో కన్పిస్తుంది. 1565 తల్లికోట యుద్ధంలో విజయనగర పతనం తర్వాత ఈ దుర్గం గోల్కొండ నవాబుల ఆదీనమైనది. చివరి కుతుబ్ షాహీ ప్రభువుల శాసనాల ప్రకారం నాగార్జునకొండ దుర్గాన్ని నేటి కడప జిల్లాలోని [[పుష్పిగిరి]] పీఠానికి అగ్రహారంగా ఇచ్చారు.
 
==శాసనాలు==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునకొండ" నుండి వెలికితీశారు