నాగార్జునకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: fr:Nagarjunakonda
పంక్తి 19:
[[నాగులు]], [[యక్షులు]] మొదలైన ప్రాచీనాంధ్ర జాతులు ఈ ప్రాంతంలో నివసించేవారు. ప్రాచీన శాసనాలలో ఈ ప్రాంతం పేరు శ్రీపర్వతం. ఈ లోయ [[శాతవాహనులు|శాతవాహన]] రాజ్యంలో ఉండేది. దీనికి దగ్గరలో సెఠగిరి ఉండేది. నాగార్జునకొండలో లభించిన వసుసేనుని శాసనం ప్రకారం అభీరసేనుని సేనాని శివసేపుడు సెఠగిరిపై అష్టభుజ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. సెఠగిరి జనాదరణ పొందిన హిందూ క్షేత్రం. ఇది శాతవాహన రాజుల ఉపరాజధాని. వీరిలో చివరివాడైన [[యజ్ఞశ్రీ శాతకర్ణి]] నారార్జునాచార్యుని కొరకు శ్రీపర్వతం పైన మహాచైత్య విహారాలను నిర్మించాడు.
 
[[ఇక్ష్వాకులు]] ఇక్కడ శాతవాహనుల సామంతులుగా ఉండేవారు. వీరిలో వాసిష్ఠీపుత్ర శ్రీఛాంతమూలుడు నాలుగో పులోమావిపై విజయాన్ని సాధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఈ ప్రాంతంలో "[[విజయపురి]]" అనే పేరుతో నగరాన్ని నిర్మించి తమ రాజధానిగా చేసుకున్నారు. నలుగురు ప్రముఖ ఇక్ష్వాకులలో శ్రీఛాంతమూలుడు [[అశ్వమేధ యాగం]] చేశాడు. ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వతం - విజయపురి క్రీ.శ. 200 నుండి 300 వరకు మహోజ్వలంగా విలసిల్లింది.
 
ఇక్ష్వాకుల తర్వాత ఈ ప్రాంతాన్ని పల్లవులు ఏలినారు. ప్రాచీన పల్లవులలో ఆద్యుడైన సింహవర్మ తమ ప్రత్యర్ధులైన కదంబులకు సాయం చేశారనే నెపంతో ఇక్ష్వాకు వంశాన్ని తుదముట్టించి బౌద్ధక్షేత్రాలను విజయపురిని ధ్వంసంచేశాడు. కర్ణాటకలోని కదంబ వంశ స్థాపకుడైన మయూరశర్మ శ్రీపర్వతాన్ని ఆక్రమించి, స్థావరం చేసికొని బృహద్బాణులను జయించి, పల్లవులతో యుద్ధం చేశాడు. తర్వాత పల్లవులతో సంధిచేసికొని శ్రీపర్వతం వదలివెళ్ళాడు.
"https://te.wikipedia.org/wiki/నాగార్జునకొండ" నుండి వెలికితీశారు