సుమతీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
[[ఫైలు:Telugu sumathisatakam2.GIF|right|thumb|250px| http://www.avkf.org/BookLink/book_link_index.php లో సుమతీ శతకం గురించిన సమీక్ష]]
 
== కొన్నిపద్యాలుపద్యాలు, తాత్పర్యాలు ==
 
సుమతీ శతకం పద్యాలకు భావాలు, వ్యాఖ్యలు వ్రాయడం సాహసమే అవుతుంది. ఎందుకంటే ఇవి చాలా తేలిక పదాలతో వ్రాయబడి, అందరికీ తెలిసిన పద్యాలు. అయినా ఈ నాటికీ ఈ పద్యాలలోని నీతి ఎలా వర్తింస్తుందో ఇక్కడ క్లుప్తంగా సూచించడమైంది.
పంక్తి 515:
భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ!
తాత్పర్యం: స్త్రీల పట్ల విశ్వాసం, పాములతో స్నేహం, పరస్త్రీల ప్రేమ, వేప చెట్లలో తీయదనం, రాజుల పట్ల నమ్మకం అన్నీ అసత్యాలు.
*గడనగల మననిఁజూచిన
నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో
గడ నుడుగు మగనిఁ జూచిన
నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!
తాత్పర్యం:స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు.
*చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్
హేమంబుఁ గూడఁబెట్టిన
భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!
తాత్పర్యం: చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లు అజ్ఞాని కూడబెట్టిన బంగారమంతా రాజుల వశమై పోతుంది.
*కులకాంత తోడ నెప్పుడుఁ
గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!
తాత్పర్యం: భార్యతో ఎప్పుడూ తగాదా పడవద్దు. ఆమెపై లేనిపోని నేరాలను ఆరోపించవద్దు. ఉత్తమ ఇల్లాలు కంట నీరు కింద పడిన ఇంటిలో లక్ష్మిదేవి ఉండదు.
*కూరిమిగల దినములలో
 
కూరిమిగల దినములలో
నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!
తాత్పర్యం:పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో నేరాలు ఎప్పుడూ కనిపించవు. ఆ స్నేహం చెడగానే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. ఇది నిజం.
*కొంచెపు నరుసంగతిచే
నంచితముగఁ గీడువచ్చు నదియెట్లన్నన్
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!
తాత్పర్యం: చిన్న నల్లి కుడితే... ఆ నల్లి ఉన్న మంచాన్ని ఎండలో వేయడం, కర్రతో కొట్టడం, మరుగునీళ్లు పోయడం మొదలైన వన్నీ చేస్తాం. నల్లితో స్నేహం చేయడం వల్లే మంచానికే ఈ కష్టాలు. అలాగే అల్పుడైన వాడితో స్నేహం చేస్తే ఎలాంటి వారికైనా ఆపదలు వస్తాయి.
*కారణములేని నగవును
బేరణమును లేని లేమ పృథివీస్థలిలో
బూరణము లేని బూరెయు
వీరణములేని పెండ్లి వృధరా సుమతీ!
తాత్పర్యం: కారణం లేని నవ్వు, నృత్యం (రవిక) లేని స్త్రీ, పూర్ణం లేని బూరె, వీరణం లేని పెళ్లి వ్యర్థాలు.
*కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుడు గవయ గూడుట యెల్లన్
బ్రేమమున జెరకు పిప్పికి
Line 555 ⟶ 554:
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!
తాత్పర్యం:చెడ్డవారితో స్నేహం మంచిది కాదు. కిర్తి వచ్చిన తరవాత అది నశించదు. అప్పు తీసుకోవడం తగవులకు మూలం. స్త్రీల వద్ద ప్రేమ శూన్యం.
*కవిగానివాని వ్రాఁతయు
నవరసభావములు లేని నాతుల వలపుం
దవిలి చను పందినేయని
వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ!
తాత్పర్యం: కవి కానివాడు రాసిన రచన, తొమ్మిది రసాల స్థితులు తెలియని స్త్రీ ప్రేమ, ముందుపోయే పందిని వెంబడించి కొట్టలేని వాని ఆయుధ విద్యలోని నేర్పరితనం వ్యర్థం.
* కసుగాయఁ గరచి చూచిన
మసలక తన యోగరుగాక మధురంబగునా?
పసగలుగు యువతులుండఁగఁ
బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ!
తాత్పర్యం: పక్వానికి వచ్చిన పళ్లను వదిలి పచ్చికాయలను తింటే వగరుగా ఉన్నట్లే, చాతుర్యం గల పడుచులు ఉండగా పసిపాపలను కూడెడు వానికి సుఖము శూన్యము. అలాంటివాడు నిజంగా పశువే.
*కరణము సాధై యున్నను
గరి మద ముడిగినను బాము కరవకయున్నన్
ధరదేలు మీటకున్నను
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!
తాత్పర్యం: కరణం నెమ్మదస్తుడైనా, ఏనుగు మదం పోయినది అయినా, తాచుపాము కరవకున్నా, తేలు కుట్టకున్నా ఆశ్చర్యంతో మిక్కిలి తేలికగా చూస్తారు.
*కరణము గరణము నమ్మిన
మరణాంతకమౌను గాని మనలేడు సుమీ
కరణము తన సరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!
తాత్పర్యం: ఒక లేఖకుడు మరో లేఖకుని నమ్మితే మరణంతో సమానమైన ఆపదను కొనితెచ్చుకున్నట్లే. అందుకే, లేఖకుడు తనతో సమానమైన మరో లేఖరిని విశ్వసింపక, తన గుట్టును చెప్పక జీవించాలి.
*కమలములు నీడఁ బాసినఁ
గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్
దమ దమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!
తాత్పర్యం: కమలములు పుట్టిల్లయిన నీటిని విడిచిపెట్టి మిత్రుడు అయిన సూర్యుని ఎండ తాకిన వెంటనే కమిలిపోతున్నాయి. అలాగే, మానవులు తమ నివాసాలను విడిచిపెడితే స్నేహితులే శతృలవుతారు.
*కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగమైన సతి తులువైనన్
ముప్పున దరిద్రుడైనను
దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!
తాత్పర్యం:కప్పకు కాలు విరిగినా, పాముకు రోగం వచ్చినా, భార్య దుష్టురాలైనా, ముసలితనంలో దారిద్య్రం సంభవించినా ఎక్కువ దుఃఖప్రదాలు అవుతాయి.
*కనకపు సింహాసనము
శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ
దొనరఁగ బట్టముగట్టిన
వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!
తాత్పర్యం: శుభ ముహూర్తంలో కుక్కను తీసుకొచ్చి బంగారు సంహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా, దాని నిజనైజాన్ని ఎలా మానలేదో అల్పునికి ఎంత గౌరవం చేసి మంచి పదవి ఇచ్చినా తన నీచత్వాన్ని వదలలేడు.
*కడు బలవంతుడైనను
బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం
దడవుండనిచ్చె నేనియు
Line 594 ⟶ 598:
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!
తాత్పర్యం:నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చునట్లే, భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం పర్యాయంగా వస్తూంటాయి.
*ఒల్లనిసతి నొల్లనిపతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!
తాత్పర్యం: తన్ను ప్రేమించని భర్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు.
*ఒకయూరికి నొక కరణము
నొక తీర్పరియైనఁ గాక వొగిఁదరుచైనం
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ!
తాత్పర్యం: ఒక గ్రామానికి ఒక లేఖరి, ఒక ధర్మాధికారి ఉండాలి. అలాకాక ఎక్కువమంది అయితే అనేక గందరగోళాలు పుట్టి సమస్తం చెడిపోవుట సహజము.
* ఏరకుమీ కసుగాయలు
దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ
పారకుమీ రణమందున
Line 612 ⟶ 617:
దెప్పలుగ జెరువునిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
తాత్పర్యం: చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు.
*ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ!
తాత్పర్యం: నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికే యజమానిని సేవిచే వాడి బతుకూ ప్రాణభయంతో కూడినదే సుమా!
*ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
నుపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
తాత్పర్యం:మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి.
*ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!
తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, కొవ్వుతో విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్న ఆబోతు వద్దకు, విద్యనేర్వని అల్పుని దగ్గరకు వెళ్లకుము.
*ఉత్తమ గుణములు నీచు
కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా
నెత్తిచ్చి కరగిపోసిన
నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ!
తాత్పర్యం:బంగారానికి సమానమైన ఎత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించిపోసినా బంగారం ఎట్లు కానేరదో అదేవిధంగా లోకంలో నీచునకు ఎక్కడా ఏ విధంగానూ మంచి గుణాలు కలగవు.
*ఉడుముండదె నూరేండ్లును
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్
మడుపునఁ గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!
తాత్పర్యం:ఉడుము నూరేళ్లు, పాము పది వందల ఏళ్లు, కొంగ చెరువులో చిరకాలం జీవిస్తున్నాయి. వాటి జీవితాలన్నీ నిరుపయోగాలే. మానవుని జీవితం అలా కాక ధర్మార్థకామమోక్షాసక్తితో కూడినది కావాలి.
*ఇమ్ముగఁ జదువని నోరును
అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
తాత్పర్యం:ఇంపుగా పఠింపని నోరు, అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు, తమ్ముడూ అని పిలవని నోరు కుమ్మరివాడు మన్ను తవ్విన గోయితో సమానం సుమా!
*ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!
తాత్పర్యం:లోకంలో ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము, బాధ పొందకుండా ఇచ్చువాడే దాత, ఆవేశాన్ని ఓర్చుకొనేవాడే మానవుడు, ధైర్యం కలవాడే వంశశ్రేష్ఠుడు.
*అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యముఁ
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
తాత్పర్యం:అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ఞానం, ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ లోకములో ఉండవు.
*అప్పుగొని సేయు విభవము
 
అప్పుగొని సేయు విభవము
ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
దప్పురయని నృపురాజ్యము
దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ!
తాత్పర్యం:రుణము తెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనంలో పడుచు భార్య, తప్పులను కనిపెట్టని రాజు రాజ్యము సహింపరానివి. చివరకు హాని కలిగించేవి.
*అడియాస కొలువుఁ గొలువకు
గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!
తాత్పర్యం:వృథా ప్రయాస అగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయం లేకుండా ఒంటరిగా పోకుము.
*అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!
తాత్పర్యం:అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకుని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది.
*అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
తాత్పర్యం:అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.
*శ్రీరాముని దయచేతను
 
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
ధారాళమైన నీతులు
"https://te.wikipedia.org/wiki/సుమతీ_శతకము" నుండి వెలికితీశారు