మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల''' [[విజయనగరం]]లో ప్రసిద్ధిచెందిన సంగీత మరియు నృత్య కళాశాల. ఎందరో సంగీత విద్వాంసులు విజయనగరంలో శిక్షణ పొంది దేశదేశాల్లో తమ కీర్తిని, విజయనగరం ఖ్యాతిని చాటి చెప్పుకున్నారు. ఒకనాడు మహా రాజులు తమ ఆస్థానంలో సంగీత కళాకారులను పోషించారు. ఆ మహారాజులే గానకళపట్ల అభిమానంతో ఒక కళాశాలను ఏర్పాటు చేశారు.
==చరిత్ర==
ఈ సంగీత కళాశాలకు విజయరామ గజపతిరాజు శ్రీకారం చుట్టారు. తన ఆస్థానంలోని ఉద్యోగి చాగంటి జోగారావు కుమారుడు గంగ బాబు అంధుడు. ఆ బాలుడి కోసం [[1919]] [[ఫిబ్రవరి 5]]న విజయరామ గజపతిరాజు [[విజయరామ గాన పాఠశాల]]ను ఏర్పాటు చేశారు. ఆనాడు ఈ పాఠశాలకు హరికథా పితామహుడు [[ఆజ్జాడఅజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు]] అధ్యక్షులయ్యారు. అనంతరం వయోలిన్‌ వాద్యంలో మేటి అయిన పద్మశ్రీ [[ద్వారం వెంకటస్వామి నాయుడు]] ఈ కళాశాలలో విద్యార్థిగా చేరటానికి రాగా ఆయననే అధ్యక్షులుగా నియమించారు. ఇది ఆయనలోని కళానైపుణ్యానికి నిదర్శనం. అనంతరం ద్వారం నరసింగరావునాయుడు కళాశాల అధ్యక్షులుగా పని చేశారు.
 
విజయనగరం కోట వెనుక ప్రాంతంలోని నేటి ఈ కళాశాలను టౌన్‌ హాలు అని పిలిచేవారని అంటారు కొందరు. దక్షిణాదిన కర్ణాటక శాస్ర్తీయ సంప్రదాయాలను పరిరక్షించే ఈ పాఠశాలలో [[వీణ]], గాత్రం, [[వయోలిన్]]‌, [[మృదంగం]], [[సన్నాయి]], [[డోలు]] వాద్యాలలో శిక్షణ ఇచ్చేవారు. అయితే [[హరికథ]] కోర్సును నాటినుంచి నేటి వరకూ అవకాశం కల్పించలేదు. హరికథ, ఫ్లూట్‌ కోర్సులను కళాశాలలో ప్రవేశపెట్టాలని ప్రతి ఏటా వినతులు పంపుతున్నారు.