"నాగం జనార్ధన్ రెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[నాగం జనార్ధన్ రెడ్డి]] [[తెలుగుదేశం]] పార్టీకి చెందిన నాయకుడు. ఆయన స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా [[నాగర్ కర్నూల్]] మండలంలోని నాగపూర్ ఒక కుగ్రామం. ఆ ఊరి పేరే ఆయన ఇంటిపేరు అయింది.
 
వీరి కుటుంబం ఆ గ్రామంలో ఉన్నత కుటుంబం. ఆయన తండ్రి ఆ రోజుల్లో ఎక్సైజు కాంట్రాక్టులు నిర్వహించే వాడు. ఆయన తండ్రి పేరు వెంకటస్వామి, తల్లి నారాయణమ్మ. మూడో తరగతి దాకా ఊర్లోనే చదివాడు. తరువాత పీయూసీ దాకా నాగర్ కర్నూల్ లో జరిగింది. తర్వాత [[ఉస్మానియా వైద్య కళాశాల]]లో వైద్య విద్యనభ్యసించాడు. అప్పట్లో [[తెలంగాణా ఉద్యమం]] ప్రభలంగా ఉండటంతో పాటు విశ్వవిద్యాలయం కేంద్రంగా నడుస్తుండటంతో ఆయన ఈ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. చాలా సార్లు అరెస్టు కూడా అయ్యాడు.
 
వైద్య విద్య పూర్తయ్యాక 1976లో నాగర్ కర్నూల్ లో వైద్యునిగా ప్రాక్టీసు మొదలు పెట్టాడు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశాడు. 52 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మళ్ళీ 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచాడు. 1989 లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేసి ఓడిపోయాడు. మళ్ళీ 1994 లో మళ్ళీ తెలుగుదేశంలో చేరి టికెట్ సంపాదించాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వరుసగా నాలుగు సార్లు [[నాగర్ కర్నూల్ శాసనసభ నియోజక వర్గం]] నుంచి గెలుస్తూనే ఉన్నాడు. ప్రొహిబిషన్, ఎక్సైజ్, అటవీ, వైద్య ఆరోగ్య, పౌర సరఫరా, పంచాయితీ రాజ్ తదితర శాఖలను నిర్వహించాడు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/460949" నుండి వెలికితీశారు