బ్రహ్మపుత్రా నది: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hu:Brahmaputra
పంక్తి 25:
 
[[బంగ్లాదేశ్]] లో, బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా జమున గ సాగి దిగువ గంగలో కలుస్తుంది, ప్రాంతీయులు దీనిని పద్మ నది అంటారు. వేరొక పాయ దిగువ బ్రహ్మపుత్ర గా పారి [[మేఘ్న]] నదిలో కలుస్తుంది. ఈ రెండు పాయలు చివరకు బంగ్లాదేశ్లోని [[చాంద్ పూర్]] అనే ప్రదేశంలొ కలిసి బంగాళా ఖాతం లోకి సాగిపోతాయి. ఈ ప్రదేశంలో గంగ, బ్రహ్మపుత్ర నది జలాలు [[గంగ - బ్రహ్మపుత్ర డెల్టా]] ని ఏర్పరుస్తుంది. ఈ నది డెల్టా ప్రపంచంలోనే అతి పెద్దదైనది.
==బ్రహ్మపుత్రపై చైనా జలవిద్యుత్‌ ప్రాజెక్టు==
బ్రహ్మపుత్ర నదిపై టిబెట్‌లో ఓ భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టును నిర్మిస్తోంది. బ్రహ్మపుత్రను టిబెట్‌లో [[త్య్సాంగ్‌పో]] నదిగా పిలుస్తారు. అక్కడ నమ్చా ప్రాంతంలో బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతి పెద్దదైన జలవిద్యుత్‌ ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. 26 టర్బైన్స్‌తో పనిచేసే ఈ డ్యామ్‌ గంటకు 40 మిలియన్‌ కిలోవాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతుంది. ఈ ఏడాది మార్చి 16న దీనికి శంకుస్థాపన జరగగా మార్చి 16న పనులు ప్రారంభమయ్యాయి. చైనాలోని టాప్‌ ఫైవ్‌ విద్యుత్‌ కంపెనీలు ఓ కన్సార్టియంగా ఏర్పడి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాయి. ఇది పూర్తయితే ఇప్పటివరకు చైనాలో మొదటిస్థానంలో ఉన్న త్రీ గోర్జెస్‌ డ్యాం కంటే పెద్దదవుతుంది. బ్రహ్మపుత్ర నది భారత్‌, బంగ్లాదేశ్‌లకు ఎంతో ముఖ్యమైనది. మన దేశంలో 40 శాతం జలవిద్యుత్‌ అవసరాన్ని, 30 శాతం నీటి వనరుల అవసరాన్ని ఈ నది తీరుస్తోంది. బంగ్లాదేశ్‌లో అయితే మంచినీటికి, సేద్యానికి ఈ నదే ప్రధాన ఆధారం. దీనిపై భారత్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలను చైనా తోసిపుచ్చుతూ దీంతో తమకు సంబంధం లేదని అది పూర్తిగా ప్రైవేటు సంస్థల వ్యవహారమని పేర్కొంది. మరోవైపు డ్యామ్‌ ఇంజనీర్లు మాత్రం ఇది పూర్తయితే భారత్‌, నేపాల్‌,బంగ్లాదేశ్‌లకు చౌకగా విద్యుత్‌ సరఫరా చేయవచ్చని, బంగ్లాదేశ్‌కు వరదముప్పు తప్పుతుందని అంటున్నారు.(ఈనాడు16.10.2009)
 
==నదీ ప్రయాణ సౌకర్యాలు==
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మపుత్రా_నది" నుండి వెలికితీశారు