"విరాట పర్వము ప్రథమాశ్వాసము" కూర్పుల మధ్య తేడాలు

చి
కృష్ణార్జునుల బొమ్మ
చి (కృష్ణార్జునుల బొమ్మ)
[[File:Kris.JPG|right|thumb|కృష్ణార్జునులు]]
=== ప్రధమాశ్వాసం ===
పాండవుల అరణ్యవాసం ముగిసిందని వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు " మహర్షీ! మా తాతలు పాండవులు వనవాసానంతరం అజ్ఞాతవాసమును అతి రహస్యంగా, చాతుర్యంగా, కౌరవులకు తెలియకుండా ఎలా గడిపారు వివరంగా చెప్తారా " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా పాండవులు తమవనవాస కాలాన్ని పూర్తి చేసారు. ధర్మరాజు తమతో వచ్చిన బ్రాహ్మణులను చూసి " అయ్యా! ఇన్నాళ్ళు మాతో పాటు మీరూ అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇక మేము అజ్ఞాతవాసం గడపవలసి ఉంది. మా అజ్ఞాతవాసం మేము నిర్విఘ్నము గా గడపాలని మమ్మల్ని ఆశీర్వదించండి " అని నమస్కరించాడు. ధౌమ్యుడు " ధర్మరాజా! నీవు ధర్మ స్వరూపుడవు నీ వలెనే పూర్వము ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకము పోగొట్టుకొనుటకు నిషాధాచలము మీద, హరి అధితి గర్భములో వామన మూర్తిగానూ, ఔర్యుడు తన తల్లి తొడలోనూ అజ్ఞాతవాసం చేసారు. కాలం కలసి వచ్చిన తరవాత పూర్వ వైభవం పొందారు. నీవు కూడా అలాగే నీ అజ్ఞాతవాసానంతరం పూర్వ వైభవం పొందగలవు " అన్నాడు. బ్రాహ్మణులందరూ పాండవులను దీవించి తమతమ ప్రదేశాలకు వెళ్ళారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/462359" నుండి వెలికితీశారు