అతిసారం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: ku:سکچوون; cosmetic changes
పంక్తి 16:
== వ్యాధి నిరోధకత ==
మూత్ర, మలవిసర్జనల తరువాత, అన్నం తినే ముందు చేతులు కడుగుక్కోవాలి. కాచి చల్లార్చిన నీరు త్రాగాలి. రోటా వైరస్ కు [[వాక్సిన్|వాక్సిన్‌]]ని తయారు చేశారు. కాని వ్యాక్సిన్ వల్ల అన్న ప్రేగు మెలిక పడడం వల్ల సంత(మార్కెట్టు) నుండి తీసివేయడం జరిగింది. సాల్మొనెల్లాకి కూడా వ్యాక్సిన్ ఉంది కాని దీనికి 3 సంవత్సరాలుకి ఒకసారి బూస్టర్స్ ఇవ్వాలి.
==చేతి శుభ్రతతో డయేరియా దూరం==
మలవిసర్జన తరువాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల పిల్లల్లో డయేరియాతో సంభవించే మరణాలను 40 శాతం మేర తగ్గించవచ్చని యునిసెఫ్ నిపుణులు చెబుతున్నారు. ఈ విధానం అత్యంత సమర్థవంతమైన, చౌకైన నివారణ పద్ధతని వారు వివరించారు. చేతులు శుభ్రంగా కడుక్కుంటే తీవ్రస్థాయి వూపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను కూడా 55 శాతం మేర నిరోధించవచ్చని తెలిపారు. ఈ రెండు వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. చైనాలో ప్రాథమిక పాఠశాలల్లో సబ్బులు పంపిణీ చేయడం వల్ల పిల్లల్లో గైర్హాజరు 54 శాతం మేర తగ్గినట్లు తేలింది. కాన్పు చేసే నర్సులు, తల్లులు చేతులు శుభ్రంగా కడుక్కుంటే నవజాత శిశువులు మనుగడ సాగించే అవకాశాలు 44 శాతం మేర పెరుగుతాయి.ఒక గ్రాము మానవ మలంలో లక్ష వైరస్ ఉంటాయి. దేశంలో ఇప్పటికీ 65 శాతం మంది బహిరంగ ప్రదేశాల్లోనే మల విసర్జన చేస్తున్నారు.ఇందువలన కలిగే ఇన్ఫెక్షన్ల ను నివారించాలి.అక్టోబర్ 27ను 'చేతి శుభ్రత దినం'గా పాటిస్తున్నారు.(ఈనాడు 26.10.2009)
 
*[[వర్గం:వ్యాధి లక్షణాలు]]
"https://te.wikipedia.org/wiki/అతిసారం" నుండి వెలికితీశారు