రుక్సానా కౌసర్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఉగ్రవాదిని చంపిన మహిళ.కాశ్మీర్ తీవ్రవాదులగుండెల్లో బుల్లెట్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఉగ్రవాదిని చంపిన మహిళ.కాశ్మీర్ తీవ్రవాదులగుండెల్లో బుల్లెట్లు దింపిన మహిళ రుక్సానా (19).. జమ్మూకి 217 కి.మీ. దూరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం రుక్సానాది. కాశ్మీర్లో తీవ్రవాదుల దుశ్చర్యలు, కల్లోలం, రాత్రి వేళ ఇళ్లల్లోకి చొరబడటం, ఆకస్మిక దాడులకు తెగబడటం, అమ్మాయిల అపహరణలు, లైంగిక వేధింపులు నరకయాతనే. అలాంటి తీవ్రవాదులపై గొడ్డలితో విరుచుకుపడి, ఒకరిని చంపి... మిగిలిన వారిని పరుగులు తీయించింది రుక్సానా.అరుదైన సాహసం. ఆమె హతమార్చింది ఒక కమాండర్ స్థాయి తీవ్రవాది ని. రుక్సానా బాగా చదువుకున్న అమ్మాయి కాదు.తండ్రి వ్యవసాయదారుడు. వ్యవసాయ పనులు లేనప్పుడు రోజుకూలీగా పని చేసేవాడు.సరిహద్దు జిల్లా రాజౌరీ. ఎనిమిదేళ్ల క్రితం ఓసారి రుక్సానా కుటుంబం తీవ్రవాదుల దాడికి గురయింది. తండ్రి గాయాలపాలయ్యాడు. తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టడం, వారు పడిపోవడం గమనించిన రుక్సానా తట్టుకోలేకపోయింది. తీవ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొంది.'నేను పెరిగిన వాతావరణం, ఆ క్షణంలో ఉన్న పరిస్థితి, టీవీల్లో తుపాకీ పేల్చడం చూసిన సందర్భాలు నాకు తెలియకుండానే స్పందించేలా చేశాయి. కళ్లు మూసి తెరిచేలోపు బుల్లెట్లు బయటికొచ్చాయి' అందామె.తీవ్రవాదులు తమ కుటుంబంపై ప్రతీకార దాడి చేస్తారని ఆందోళన చెందుతున్న రుక్సానా భవిష్యత్తు లక్ష్యం పోలీసు శాఖలో చేరడం. యువతకు తుపాకీ శిక్షణ ఇవ్వాలన్న వాదనకూ ఆమె మద్దతు పలుకుతుంది. ఆమె ధ్యేయం భారత సైన్యంలో చేరడం.రుక్సానా సాహసం దేశంలోని మహిళలకు ఎనలేని ప్రేరణనిచ్చింది. 'ప్రాణ, మానాలకు హాని ఎదురైనప్పుడు రుక్సానా తీరుని మేం అనుసరిస్తాం అంటున్నారు.(ఈనాడు8-10-2009).రుక్సానా కౌసర్‌ ఇంటిపై రాత్రి గ్రెనేడ్‌ దాడి జరిగింది. అయితే ఆ సమయంలో ఇంటిదగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.దగ్గరలోని కొండలపైనుంచి తీవ్రవాదులు రెండు గ్రెనేడ్లు విసరగా అవి గురితప్పి ఆమె ఇంటికి దూరంగా పడ్డాయి.(ఈనాడు1.11.2009)
==పోలీసు అధికారిగా రుక్సానా==
లష్కరే తోయిబా తీవ్రవాదిని హతమార్చి [[వీరనారి]] గా పేరు సాధించిన రుక్సానా కౌసర్‌ను ప్రత్యేక పోలీసు అధికారిగా నియమించారు. ఆమెతో పాటు తీవ్రవాదుల దాడిలో గాయపడ్డ ఆమె సోదరుడు ఐజజ్‌, పినతండ్రి హుస్సేన్‌లను కూడా పోలీసు ఉద్యోగాల్లోకి తీసుకున్నారు.(ఈనాడు3.11.2009)
"https://te.wikipedia.org/wiki/రుక్సానా_కౌసర్" నుండి వెలికితీశారు