వికీపీడియా చర్చ:ఏకవచన ప్రయోగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
::కొంతమందిని వాడు, వీడు అని మనం వ్యవహారికంగా అంటూవుంటాము కాబట్టి, అందరినీ ఏకవచన ప్రయోగంతోనే సంభోదిస్తున్నాం. ఈ వాదనను ఇంకో విధంగా చూద్దాం... కొంతమందిని గౌరవ సూచకాలతో పిలుస్తున్నాం కాబట్టి, అందరికీ అదే వర్తింపజేసి గౌరవ సూచకాలతో పిలుద్దాం. ''కూలీ'' అనేది ఒక వృత్తిపేరు. ఆ వృత్తి చేస్తున్న వ్యక్తి గురించి వ్యాసం రాస్తున్నప్పుడు గౌరవ సూచకాలు వాడొచ్చనుకుంటా. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 05:08, 2 నవంబర్ 2009 (UTC)
::ప్రదీప్ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇంగ్లీషు వికీతో కొన్ని విషయాలలో మనం విభేధిస్తే తప్పుకాదు తప్పులేదు. తెలుగు సంస్కృతిలో పెద్దవారిని, స్త్రీలను, విద్యావేత్తలను, గురువులను ఇంకా విస్తృతంగా చెప్పాలంటే ఇతరులను అందరినీ ఏకవచనంతో సంబోధించడం నా ఉద్దేశంలో, మరియు విజ్ఞానుల అభిప్రాయంలో అగౌరవ పరచడమే అని భావిస్తారు. వీరందరినీ బహువచనంలో సంబోధించడం సమంజసం అని, అంతకు ముందు జరిగిన చర్చను పునఃపరిశీలించి అభిప్రాయాన్ని మార్చితే బాగుంటుందని నా గాఢ విశ్వాసం[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 04:20, 2 నవంబర్ 2009 (UTC)
::: ఈ విషయంపై మరింత లోతుగా చర్చించేముందు ఈ విషయంపై నాకెలాంటి శాసనాధికారాలు కానీ, ఈ విషయంపై పాండిత్య స్థాయి అవగాహాన కానీ లేవని, ఏ పద్ధతి సరైనదో ఖచ్చితంగా నాకూ తెలియదని చెప్పదలచుకొన్నాను.
# ప్రదీపు గారూ, ఏకవచన ప్రయోగం గ్రాంధికం కనుమరుగైన ఆధునిక కాలంలో (80,90వ దశకాల్లో) కూడా విజ్ఞానసర్వస్వాల్లో ఏకప్రయోగించారని చెప్పటానికే అక్కడ రెండవ ఉదహారణ (టోనీ మారిసన్ గురించినవ్యాసం) ఇవ్వబడింది.
# మీరు గ్రాంథికాన్ని వ్యవహారికంలో వ్రాసి అసభ్యంగా ధ్వనించింది అన్న వాక్యాన్ని రెండు, మూడు సార్లు చదివినా అది నాకు అసభ్యంగా అనిపించలేదు. నిజానికి గ్రాంథికంలోని వాక్యమే నాకు ఇంకా ఎబ్బెట్టుగా తోచింది (దానికి కారణం ఆ వాక్యంలో డు అనే విభక్తితో కాకుండా ఏకంగా వాఁడు అంటు స్పష్టంగా పలికించడం అనుకుంటా). ఇలా ఒక్కో వాక్యాన్ని ఎండగట్టినా ఆ వాక్యంలో అసభ్యత ధ్వనిస్తుందాలేదా అన్నది వ్యక్తిగత అభిరుచి అని మాత్రం చెప్పగలను. (ఈ వ్యక్తిగత అభిరుచులను సామాజిక, ప్రాంతీయతలు కొంత ప్రభావితం చేస్తాయనుకోండి)
# ఇష్టంలేని వ్యక్తులు చనిపోయినప్పుడు ఏకవచనం ప్రయోగించడం కూడా వ్యక్తిగత/ప్రాంతీయ అభిప్రాయమేమో. మళ్లీ నా ఉదాహరణే తీసుకుంటే నేను పెరిగిన ప్రాంతంలో ఆత్మీయులని బహువచనంతో ప్రయోగించే అలవాటులేదు. బహువచనం ప్రయోగించారంటే గౌరవమిస్తూనే మీకు, మాకు మధ్య కొంత దూరముందని చెప్పినట్టవుతుంది. అందుకే ఈ జీవితంలోనూ, పైజీవితంలోనూ ఎప్పుడూ నాన్నని బహువచనంలో పిలవరు. "నాన్నగారు చనిపోయారు" అని అనకపోయినా, "నాన్నగాడు చనిపోయాడు" అనిమాత్రం అనరు. మా ప్రాంతంలో సాధారణ వాడుకేంటంటే "నాన్న చనిపోయాడు" (ఇది వికీపీడీయాలో నియమానికి కాదండి..కేవలం ప్రాంతీయ బేధాలను చెప్పటానికే) - ఇప్పుడు గురజాడ గ్రాంథికవాక్యం నాకు ఎబ్బెట్టుగా ఎందుకు తోచిందో మీకు అర్ధం అయ్యుంటుంది.
# రాజశేఖర్ గారూ, ఇంగ్లీషు వికీపీడీయాకి ఇలాంటి చిక్కేలేదండి. వాళ్ళకి మనలాగా బహువచన, ఏకవచన వ్యవహారాలే లేవు కదా. అందర్నీ హి, షి అని పిలిచెయ్యటమే! అవును మన సంస్కృతిలో పెద్దవారిని గౌరవించాలి కానీ అప్పుడు ఎందుకు పెద్దవారు, ఎవరికంటే పెద్దవారు అన్న సవాలక్ష చిక్కులొస్తాయి. వీటిని ప్రదీపుగారు పైనే ఏకరువుపెట్టారు.
# అయితే దొంగల్ని, దొరల్ని ఒకేగాటిన కట్టి ఏకవచనం ప్రయోగించడం కంటే అందరికీ బహువచనం ఎందుకు ప్రయోగించకూడదు అని ప్రదీపు గారు అడుగుతున్నారు. నాకు సమాధానం తెలీదు. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 09:30, 3 నవంబర్ 2009 (UTC)
Return to the project page "ఏకవచన ప్రయోగం".