"వికీపీడియా చర్చ:ఏకవచన ప్రయోగం" కూర్పుల మధ్య తేడాలు

== పునః పరిశీలించాలి ==

మనం ఈ పాలసీని ఉంచాలా వద్దా అని మళ్లీ ఇంకో సారి పరిశీలించాలి. ముఖ్యంగా తెలుగులోని మొదటి విజ్ఞాన సర్వస్వాన్ని ఆధారంగా అసలే వాడకూడదనుకుంటా. అందుకు ఉదాహరణ: ''అప్పారావు నడవడికను చాలా రసికతకు ఔదార్యమునకు పేరుపడినవాఁడు. సమాజమున తన ప్రతిభచేతను, మంచితనముచేతను, చమత్కారకలిత మగు సంభాషణముచేతను చాలా చిత్తాకర్షణము చేయువాఁడు.'' ఈ వాక్యంలో ఏకవచణ ప్రయోగం ఉన్నా కూడా అగౌరవ పరుస్తున్నట్లు అనిపించదు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని ఈ కాలపు తెలుగులో ఏకవచన ప్రయోగం వాడి రాస్తే, ''అప్పారావుకు నడవడిక, రసికతక, ఔదార్యం వలన మంచి పేరుంది. సమాజంలో అతని ప్రతిభకు, మంచితనానికి, చమత్కారభరిత సంభాషణానికి అందరి మన్ననలను పొందాడు.'' రెండింటిలోనూ ఏకవచన ప్రయోగం ఉన్నాకూడా, మొదటిదాంట్లో సంభోధం అగౌరవంగా అనిపించడంలేదు, కానీ రెండో దాంట్లో మటుకు 'డు' అని అంటున్నప్పుడు అగౌరవంగా ద్వనిస్తుంది. కారణం మొదటి విజ్ఞాన సర్వస్వం కొంత గ్రాంధికంలో ఉంది కాబట్టి. గ్రాంధికంలో ఏకవచనం అగౌరవంగా లేదా అసభ్యంగా అనిపించదు.

అస్తు - --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 18:59, 3 నవంబర్ 2009 (UTC)
::ఏకవచనం, బహువచనంలలో ఏది వాడిననూ అది గౌరవం లేదా అగౌరవం కిందికి రాదు. అంతమాత్రానికి ప్రస్తుతం అమలులో ఉన్న పద్దతిని మార్చాల్సి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎవరో ఒకరు మన తెలుగు వికీపీడియన్లను ఈ విషయంలో దుమ్మెత్తిపోసినంత మాత్రాన మనం అతని వ్యాఖ్యలకు నిరుత్సాహపడనక్కరలేదు. ప్రారంభం నుంచి కొనసాగుతున్న పద్దతిని విస్మరించి మరోమార్గంలోకి పోయేటంతటి అవసరం మరియు సరైన కారణమేమీ నాకు కనిపించుటలేదు. ఈ విషయంలో నేను నా అభిప్రాయాలను చెప్పదలుచుకున్నాను.
1) తెవికీలో అందరినీ ప్రస్తుతం ఏకవచనం ఉపయోగిస్తున్నాము. అలా కాకుండా కొందరిని ఏకవచనంలో మరి కొందరిని బహువచనంలో ఉపయోగిస్తే బాగుండదు. పిల్లలను సాధారణంగా బహువచనంలో ప్రయోగించం. ''అతడు పాఠశాలకు పోయాడు'' అంటాం కాని ''పోయారు'' అనము, ''అతనికి పిల్లవాడు పుట్టాడు'' అంటామే కాని ''పిల్లవారు పుట్టారు'' అని అనం.
2) భగవంతులనే ఏకవచనంలో ప్రయోగిస్తున్నప్పుడు సాధారణ మానవులను తప్పనిసరిగా బహువచనంలో పిలువాలనే నిబంధన అవసరం లేదు.
3) వైజాసత్యగారు చెప్పినట్లు కుటుంబంలో పెద్దవారిని వారి కుటుంబ సభ్యులే బహువచనంలో పిలవడం జరుగదు. అయిననూ అది తప్పు కానప్పుడు తెవికీలో తప్పెలా అవుతుంది.
4) ఒక వ్యక్తిని 4 రకాలుగా పిలువవచ్చు. 1.ఎక్స్ వచ్చారు, 2.ఎక్స్ వచ్చాడు, 3.ఎక్స్ గారు వచ్చారు, 4.ఎక్స్ గాడు వచ్చాడు. తటస్థ దృక్కోణం వల్ల గౌరవం ఇవ్వకూడదు మరియు అగౌరవంగా ధ్వనించకూడదు కాబట్టి 3,4 తొలిగిద్దాం, ఇక మిగిలింది 1,2 లే కదా. కాబట్టి రెండూ సమానమే రెండోదీ వాడవచ్చు. నాకు తెలిసిన/ తిరిగిన ప్రాంతాల గురించి చెప్పాలంటే గ్రామీణ ప్రజలే కాకుండా పట్టణవాసులు కూడా ఏకవచనంలో ప్రయోగిస్తారు. సభలు, సమావేశాలలో కూడా వేదికపై ఉన్న పెద్దలను కూడా ఏకవచనంలోనే పేర్కొంటారు. ఇక్కడ ఇది సామాన్యమే.
5) కొన్ని వాక్యాలు బహువచనంలో వాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది మరియు వాక్యం తప్పు అవుతుంది కూడా. ఉదా: ''పాలవాడు వచ్చాడు'' అనే బదులు ''పాలవాడు వచ్చారు'' అని అనం కదా. అలాగే ''కూరగాయలమ్మే మనిషి వచ్చింది'' అంటాం దీనికీ బహువచనం పనికిరాదు. తెవికీలో ఇలాంటి వాక్యాలు వ్రాసేటప్పుడు బహువచనం ఎలా ప్రయోగిస్తాం! ఇంకోటి ''ఏరా తీసుకొచ్చావా?'' అంటే అతనికే అడుగుతున్నట్లు ప్రశ్న ఉంది. అదే బహువచనం ఉపయోగిస్తే ఆ పని అతనికే అప్పగించామా లేక ఇతరుల పని గురించి అతనికి అడుగుతున్నామా అనేది అర్థం కాదు.
6) మరోముఖ్యవిషయం, ప్రస్తుతం మనం ఒకే విమర్శను ఎదుర్కొంటున్నాం, దానికీ సమాధానం ఇస్తున్నాం (ఏకవచనం అనేది తెవికీ నియమం), అది కూడా అలవాటుగా మారితే ఏమీ అనిపించదు, బహువచనంలోకి మారితే సవాలక్ష సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao| C.Chandra Kanth Rao]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|-చర్చ]] 20:01, 3 నవంబర్ 2009 (UTC)
::: నా తరపున (గౌరవసూచకాల బడి తరపున) ఇంకొంత వాదన :) మొదటగా నేను కూడా ఏకవచనవాదినే, అందుకు నాకున్న ఏకైక కారణం పాత వికీపీడియాలలో ఏకవచనం వాడటం. కానీ ఆలోచిస్తే...
# వ్యవహారికంలో మనకు ఎటువంటి పరిచయంలేని వ్యక్తితో మాట్లాడినప్పుడు తప్పనిసరిగా గౌరవవాచకాలను వాడతాము, అలా వాడకపోతే నేనయితే అగౌరవ పరుస్తున్నట్లే అనుకుంటాను.
# "ఎక్స్ వచ్చారు", "ఎక్స్ వచ్చాడు" రెండూ ఒకటే ఎలా అవుతాయి, మొదటి దానితో సంభోదిస్తున్నప్పుడు గౌరవసూచకంగా ఉంది.
# వేదిక మీద పెద్దలను ఏకవచన ప్రయోగాలతో పిలవడం నేనయితే ఎప్పుడూ చూడలేదు.
# తల్లితండ్రులను ఏకవచనంతో సంభోధిస్తున్నప్పుడు అక్కడ ఆత్మీయత లేదా వారితో ఉన్న దగ్గరితనం వలన అలా సంభోదిస్తాము. ఈ లాజిక్కుని వ్యక్తుల వ్యాసాలకు కూడా ప్రయోగించలేమనుకుంటా. వ్యక్తుల వ్యాసాలు చదువుతున్న వారికి, ఆ వ్యక్తుల మీద అలాంటి ప్రేమను కలిగించనవసరం లేదనుకుంటా, అది కూడా POV కిందకు వస్తుందేమో. అదే వ్యాసాలలో వ్యాసాలలో గౌరవసూచకాలు వాడితే, వ్యాసం ఇంకా formalగా ఉంటుంది అని కూడా నా అభిప్రాయం.
# "పాలవాడు వచ్చాడు", "కూరగాయలమ్మే మనిషి వచ్చింది"; లాంటి ప్రయాగాలు (అంటే ''ఫలానా వృత్తి చేసుకునే వాళ్లలో ఒక వ్యక్తి ఫలా పని చేసాడు'') వికీపీడియాలో వాడే సందర్భం ఏముంటుంది?
# అందరూ నన్నయ గారు, తిక్కన్న గారు, రాములవారు అంటూ సంభోదించే వాళ్లు కూడా ఉంటారు.
__[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] ([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]]) 06:03, 5 నవంబర్ 2009 (UTC)

==మరికొంత ఆధారంఅయోమయం==
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/465516" నుండి వెలికితీశారు