విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
==సన్యాసం స్వీకరణ==
సన్యాస స్వీకారానికి ముందు విద్యారణ్యుని పేరు మాధవ. ఈ మాధవ ఇప్పటి [[వరంగల్లు]](ఏలశిలా నగరం)లోని ఇద్దరు పేద నియోగి బ్రాహ్మణ బ్రహ్మచారులలో పెద్దవాడు. వీరిలో చిన్నవాడు జ్ఞానార్జన కోసం దేశాటన జరుపుతూ శృంగేరి చేరుకొంటాడు. అప్పటి శృంగేరి పీఠాధిపతి అయిన [[విద్యాశంకర తీర్థ]]స్వామి ఆ బాలకునిలో ఉండే అధ్యాత్మిక భావానికి ముచ్చట చెంది, వానిలో ఉన్న ప్రతిభను గుర్తించి వాడికి సన్యాసం ఇస్తాడు. సన్యాసం ఇచ్చాక ఆయన పేరుని [[భారతీకృష్ణ తీర్థ]]స్వామి గా మారుస్తారు. ఇది ఇలా ఉండగా తన తమ్ముని వెదుక్కుంటూ మాధవ శృంగేరి చేరుతాడు. తన తమ్ముడు సన్యాసం తీసుకోవడం, భారతీకృష్ణ తీర్థగా మారడం తెలుసుకొంటాడు, తానూ సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు అతని తమ్ముడైన భారతీతీర్థ తన గురువైన అప్పటి పీఠాధిపతి అయిన విద్యాశంకరస్వామిని ఒప్పించి మాధవకు సన్యాసం ఇప్పిస్తాడు. విద్యాశంకర స్వామి మాధవకు సన్యాసం ఇచ్చి విద్యారణ్య అని నామకరణం చేస్తారు. విద్యారణ్య అంటే అరణ్యం వంటి జ్ఞానం కలవాడు అని అర్థం.
 
వయస్సులో చిన్నవాడైనప్పటికీ సన్యాసం ముందు స్వీకరించడంవల్ల భారతీకృష్ణ తీర్థ ముందు పీఠాధిపత్యం చేయగా,ఆ తరువాత, ఆయన తరువాత సన్యాసం తీసుకొన్న విద్యారణ్యుడు శృంగేరి శారదా పీఠాన్ని అధిరోహిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/విద్యారణ్యుడు" నుండి వెలికితీశారు