బలి: కూర్పుల మధ్య తేడాలు

rv unexplained removal of content
పంక్తి 2:
 
==అబ్రహాం సంప్రదాయంలో బలి==
*[[ ఇస్మాయిల్]] ను యుక్తవయసులో [[అబ్రాహాము]] దేవునికి [[బలి]] ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. అయితే దేవుడు ఇస్మాయిల్ కు బదులుగా ఒక [[ గొర్రె]] ను బలి ఇమ్మని చెబుతాడు. ఇతని సంతానం నుండే [[మహమ్మదు ప్రవక్త]] జన్మించారు. యూదులు క్రైస్తవులు బలి ఇవ్వటానికి తీసుకెళ్ళింది [[ఇస్ హాక్]] ([[ఇస్సాకు]]) ను అంటారు. ఈ [[ఖుర్బానీ]] సంప్రదాయాన్ని స్మరిస్తూ [[ముస్లింలు]] [[ఈదుల్-అజ్ హా]] ([[బక్రీదు]] ) పండుగ జరుపుకుంటారు.
==జీవహింస==
*అన్ని మతాలలో బలులున్నాయి. బలి అనేది ఒక [[మూఢ నమ్మకం]]. ఊళ్లో పశువులకు జబ్బులు తగులుతున్నాయి. వీటికి క్షుద్రదేవతలు కారణమని, ఆ దేవతల్ని వూళ్లోకి రాకుండా చెయ్యలంటే బలులివ్వాలంటారు. మేకను ఒక పెద్ద రాయి మీద మెడ ఆనేటట్టు పట్టుకుని ఒక్క దెబ్బతో తల నరుకుతారు. పంది తల మాత్రం బయట కుండేటట్టు పాతేసి, గేదెలు, ఎద్దులు, గిత్తలు, దూడలు, ఆవుల చేత తొక్కిస్తారు. పంది ముట్టెమీద పశువులు పడటంతో గింజుకుంటు తల పక్కకి వాలి ఘోరంగా నెత్తురు కారుతూ చనిపోతుంది.
==బలులు మహాపాపం==
దేవతల [[జాతర]] లో మూగజీవుల [మేకపోతుల] గొంతు కొరికి నరికి చంపుతారు. ఇది తామసిక మనస్తత్వం. భగవంతునికి ఈ బలి వల్ల ప్రీతి కలుగుతుందనే [[మూఢ నమ్మకం ]]. ఒక [[కాపాలికుడు]] [[కాళీ మాత]] ను ప్రసన్నం చేసుకోవాలని 100 గొర్రె పొటేళ్లను బలియివ్వాలనే ప్రయత్నం మొదలుపెట్టి 99 పొట్టేళ్ళను బలిచ్చాడు. చివరగా 100వ బలికి సిద్ధమయ్యాడు. ఒక గొర్రె పొటేలును కొని తెచ్చి దానిని పూజించి బలికి సిద్ధపరచి తన పూజా కార్యక్రమాన్ని సాగిస్తున్నాడు. అంతలో పకపకా నవ్విన శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే ఏమీ కనిపించలేదు. మరలా పూజలో నిమగ్నమయాడు. మరలా నవ్వు ఆ తర్వాత పెద్దగా ఏడ్పువినిపించింది. ఏమిటా అని భయంతో చూడగా గొర్రెపొటేలు పెద్దగా ఏడుస్తూ కనిపించింది. భయంతో బిక్కచచ్చిన కాపాలికుడు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. ఆ గొర్రె నవ్వు ఏడుపు ఆపి నేనూ ఒక జీవినే అన్నది. అయ్యా మీరెవరు? గొర్రె మాట్లాడటం ఏమిటి? నిజం చెప్పండి అన్నాడు . నాయనా నేనూ పూర్వజన్మలో ఒక కాపాలికుడనే అని అన్నదా గొర్రె. అలాగా మరయితే మీరు ఇలా ఎందుకున్నారు? ముందు నవ్వారు మరలా ఏడ్చారు ఎందుకు? అని ప్రశ్నించాడు . నేనుకూడా నీలాగనే ఎవరో చెప్పిన మాటను విని 100 పొట్టేళ్ళను కాళీమాతకు బలిస్తే అమ్మ అనుగ్రహిస్తుందని నమ్మి బలి కార్యక్రమం పూర్తి చేసాను. కాళీ మాత అనుగ్రహము కలగలేదుగానీ మహా పాపంచుట్టుకున్నది. దానివలన ఇప్పటికి 100 సార్లు గొర్రె జన్మమెత్తాను. 99సార్లు నరికి చంపబడ్దాను. ఖర్మ ఫలితం అనుభవిస్తున్నాను. ఇది చివరి జన్మ కనుక దీనినుండి విముక్తమవుతున్నాననే ఆనందం వలన నవ్వు వచ్చింది. త్వరగా బలి ముగించి నన్ను ఈ పాపమునుండి విముక్తం చేయమని కోరింది. కాపాలికునికి తాను చేసిన పాపం గుర్తుకువచ్చి గడగడలాడాడు.
 
==[[యుద్ధం]] అంటే [[నరబలి]] ==
భగవంతుని చేరే శుద్ధమార్గాన్ని [[వేదాలు]] తెలియజేశాయి. వాటిని ఆశ్రయించటమే భగవంతునికి ఇష్టం కానీ [[బలులు]] [[యుద్ధాలు]] కాదు. [[హింస]] ద్వారా జరిగిన కార్య క్రమాలు కష్టాలే మిగిల్చాయి. [[అశ్వమేధ యాగం]] చేసిన తమకు ఈ అరణ్యవాసమెందుకు వచ్చినదని ఆవేదన పడిన ధర్మజునితో నారదుడు " యజ్ఞానికి మంత్రం, కర్త, ద్రవ్యం పవిత్రమయినవై ఉండాలి. నీ తమ్ముళ్ళు బలవంతులయి ఎంతోమందిని చంపి సంపాదించుకొచ్చిన ద్రవ్యం చేత జరుపబడ్డ యజ్ఞము నీకు నెల తిరక్కుండానే అరణ్య వాసాన్ని ఇచ్చిందని వివరిస్తాడు. శుద్ధ సాత్వికతతో మాత్రమే భగవంతుని ఆరాధించాలి" అంటాడు.
 
[[వర్గం:విశ్వాసాలు]]
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
[[వర్గం:నేరాలు]]
[[వర్గం:మూఢ నమ్మకాలు]]
"https://te.wikipedia.org/wiki/బలి" నుండి వెలికితీశారు