ఆధార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
విశిష్ట [[గుర్తింపు కార్డు]] కు ఇవే ఆనవాళ్లు.గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు విశిష్ట గుర్తింపు కార్డుల జారీ చేసేందుకు వారి కళ్లను స్కాన్‌ చేయడంతోపాటు మొత్తం పది చేతివేళ్ల ముద్రలు సేకరించాలని యూఐడీఏఐ సంస్థ యోచిస్తోంది. అధిక శ్రమ వల్ల గ్రామాల్లో నివసించే ప్రజలు తమ శారీరక గుర్తులు కొంత వరకు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొందరికి కంటి చూపు, మరికొందరికి చేతివేళ్ల అరుగుదల సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున మరో ప్రత్యామ్నాయం లేదని యూఐడీఏఐ అధికారులు పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికి 16 అంకెలు గల బయోమెట్రిక్‌ విశిష్ట సంఖ్యను దేని ఆధారంగా ఇవ్వాలనే అంశం మీద గత కొద్దిరోజులుగా అధికారుల మధ్య చర్చలు సాగాయి.ప్రజల గుర్తింపు కోసం మొత్తం పది చేతివేళ్లు లేదా కళ్లు స్కాన్‌ చేయాలని సూచించిందని అధికారులు వెల్లడించారు. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో మాత్రం వీటిలో ఏదైనా ఒకదానిని అనుసరించాలని కమిటీ పేర్కొంది. గ్రామాల్లో మాత్రం రెండూ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది. అయితే ప్రజల నుంచి [[డీఎన్‌ఏ]] గుర్తులు సేకరించాలనే సలహాను కమిటీ తిరస్కరించింది. డీఎన్‌ఏ సేకరణ వల్ల పలు సమస్యలు ఉత్పన్నం కావచ్చని కమిటీ అభిప్రాయపడింది.(ఈనాడు11.11.2009)
==ఇతర [[గుర్తింపు పత్రాలు]] ==
* 1. ఎన్నికల సంఘం జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు,
* 2. భారత విదేశాంగ శాఖ జారీ చేసిన పాస్‌పోర్టు,
* 3. డ్రైవింగ్‌ లైసెన్స్‌,
* 4.[[ పాన్‌ కార్డు]],
* 5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఇతర రంగాల్లో పని చేస్తున్న వారు సంబంధిత సంస్థచే జారీచేసిన గుర్తింపు కార్డు,
* 6. బ్యాంకు, కిసాన్‌, పోస్టాఫీస్‌ పాసుబుక్కులు,
* 7. విద్యార్థుల విషయంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీచేసే గుర్తింపు కార్డులు,
* 8. [[పట్టాదారు పాసు పుస్తకాలు]] ,
* 9. రిజిస్టర్డ్‌ డీడ్‌ లాంటి ఆస్తి సంబంధ పత్రాలు,
* 10. [[రేషన్‌ కార్డు]] ,
* 11. ఎస్సీ, ఎస్టీ, బి.సి.లకు సంబంధిత అధికార సంస్థలు జారీచేసే పత్రాలు,
* 12. పెన్షన్‌ మంజూరు పత్రాలు,
* 13. రైల్వే గుర్తింపు కార్డు,
* 14. స్వాతంత్రం పోరాట యోధుల గుర్తింపు కార్డు,
* 15. ఆయుధ లైసెన్స్‌లు,
* 16. వికలాంగుల పత్రాలు.
"https://te.wikipedia.org/wiki/ఆధార్" నుండి వెలికితీశారు