రక్షకభట నిలయం: కూర్పుల మధ్య తేడాలు

వర్గీకరణ
పంక్తి 6:
 
==రక్షకభట నిలయ విధులు==
==[[ఠాణా]] ల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు==
 
అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారిని విచారించి, వారెవరో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతోంది. దీంతో బయోమెట్రిక్‌ విధానం వైపు పోలీసు ఉన్నతాధికారులు మొగ్గు చూపుతున్నారు.తరచూ నేరాలకు పాల్పడుతున్న 50వేల మంది నేరగాళ్లకు సంబంధించిన ఫొటోలు, వారి వివరాలు, వేలిముద్రలు ప్రస్తుతం పోలీసు స్టేషన్‌లోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. పోలీసు స్టేషన్‌లో బయోమెట్రిక్‌ విధానం ప్రారంభించడం ద్వారా ఈ డాటాబేస్‌లో ఉన్న సమాచారంతో పోల్చి చూసుకోవడానికి వీలవుతుంది.పోలీసు ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్‌ సర్వీసెస్‌ విభాగంలోని డాటాబేస్‌ పోలీసు స్టేషన్లకు అనుసంధానం కావడంతో నేరస్తులను గుర్తించడంతోపాటు, తప్పిపోయిన వారు, అనాథమృతదేహలు, గుర్తు తెలియని వ్యక్తుల హత్యలకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది.ప్రధాన డాటాబేస్‌ సెంటర్‌లో ప్రస్తుతం 3,65,000 ఎఫ్‌ఐఆర్‌లు, తప్పిపోయిన వారికి సంబంధించి 8వేల ఫొటోలు, గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించి 6వేల ఫొటోలు, పోలీసులు స్వాధీనం చేసుకున్న 30వేల వాహనాల వివరాలు, 3.76 కోట్ల [[సెల్‌ఫోన్‌]] వినియోగదారుల సమాచారం, 90వేల మంది వాహనదారులు, [[డ్రైవింగ్‌ లైసెన్స్‌]] ఉన్న 80వేల మంది చిరునామాలు, 5.89 కోట్ల [[ఓటరు గుర్తింపు కార్డు]] దారుల సమాచారం సిద్ధంగా ఉంది.విమానాశ్రయాల్లోని ఇమిగ్రేషన్‌ కౌంటర్ల వద్ద సైతం పోలీసు డాటాబేస్‌ను ఉపయోగించుకుని తద్వారా నేరస్తులు విదేశాలకు పారిపోకుండే చూసేందుకు వీలుంటుంది(ఆంధ్రజ్యోతి 21.11.2009).
[[వర్గం:న్యాయ శాస్త్రము]]
[[వర్గం:కార్యాలయాలు]]
"https://te.wikipedia.org/wiki/రక్షకభట_నిలయం" నుండి వెలికితీశారు