వ్యభిచారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''వ్యభిచారం''' లేదా '''పడుపు వృత్తి''' (Prostitution) అంటే [[డబ్బు]] కోసం ఒళ్ళు అమ్ముకోవడం. ఇలా జీవించేవారిని [[వేశ్యలు]] అంటారు. కొంత మంది [[స్త్రీ]]లు [[పేదరికం]] మరియు [[ఆకలి]] వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొంత మంది స్త్రీలు తల్లితండ్రుల నిర్లక్ష్యం ప్రభావం వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొన్ని ముఠాలు ఉద్యోగాలు పేరుతో అమాయక బలికలని నిర్భందించి ( కిడ్నాప్ చేసి) వ్యభిచార కేంద్రాలకి అమ్మేస్తుంటాయి. [[జెర్మనీ]] లాంటి కొన్ని దేశాలలో మాత్రమే వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యడం జరిగింది. [[ఇరాన్]] వంటి దేశాలలో వ్యభిచారానికి [[మరణ శిక్ష]] వేస్తారు. వేశ్య లేదా [[వెలయాలు]] అనగా బ్రతుకు తెరువు కోసం వ్యభిచార వృత్తిని అవలంబించే స్త్రీ. చరిత్రలో [[రాజులు]] మరియు చక్రవర్తులు తమ భొగవిలాసాల కోసం వేశ్యలను పోషించేవారు.
==జాతీయ మహిళా కమిషన్ నివేదిక ==
దేశంలోని సగానికి సగంపైగా జిల్లాల్లో ఆడపిల్లలు అన్యాయంగా వ్యభిచార కూపాలకు తరలిపోతున్నారు , వేశ్యావాటికల్లో మగ్గిపోతున్నారు అని జాతీయ మహిళా కమిషన్ నివేదిక. కనీసం 378 జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొనిఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ జిల్లాల్లో అమ్మాయిలను వేశ్యావాటికలకు తరలించే సుమారు 1794 ప్రాంతాలను మహిళా కమిషన్ గుర్తించింది. అలాగే, వ్యభిచార వృత్తి సాగించే 1016 ప్రాంతాల వివరాలను కూడా తెలుసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పలుప్రాంతాల నుంచి అమ్మాయిలను తరలించి [[అంగడిబొమ్మ]] లుగా చేసే దుష్కృత్యాలు కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లోని దాదాపు అన్నిజిల్లాల్లోనూ ఈ చీకటి కార్యకలాపాలు సాగుతుండగా...తమిళనాడు, ఒరిస్సా, బీహార్‌లలో వేశ్యావాటికలకు తరలిపోతున్న ఆడపిల్లల కథలు ఎనెన్నో...అని జాతీయ మహిళా కమిషన్ నివేదిక పేర్కొంది. మన దేశంలోని మొత్తం మహిళా జనాభాలో 2.4 శాతం మంది వేశ్యావృత్తిలో ఉన్నారు. వీరిలో అత్యధికులు 15-35 ఏళ్ల లోపువారేనని తెలిపింది. ఇందులోనూ మళ్లీ ప్రత్యేకించి చూస్తే... వేశ్యావృత్తిలోకి బలవంతంగా నెట్టబడిన అమ్మాయిల్లో 43 శాతం మంది ముక్కుపచ్చలారని మైనర్‌ బాలికలేనన్న హృదయవిదారకమైన వాస్తవం మహిళా కమిషన్ అధ్యయనంలో వెలుగుచూసింది. దుర్భర దారిద్య్రం... వారిని చీకటి మాటున వేశ్యావాటికలకు తరలించేస్తున్నాయి.(ఈనాడు 5.10.2009)
"https://te.wikipedia.org/wiki/వ్యభిచారం" నుండి వెలికితీశారు