గద్వాల సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
''గద్వాల సంస్థానము'' [[తుంగభద్ర]] మరియు [[కృష్ణా నది|కృష్ణా]] నదుల మధ్య ప్రాంతములో నడిగడ్డగా పిలువబడే అంతర్వేదిలో 800 చ.కి.మీల మేర విస్తరించి ఉండేది. [[14వ శతాబ్దము]]లో [[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] పతనము తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు [[బహుమనీ సామ్రాజ్యము]] యొక్క సామంతులు అయినారు. వంశ చరిత్ర ప్రకారము గద్వాలను [[1553]] నుండి [[1704]] వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డి మరియు కుమార వీరారెడ్డి పరిపాలించారు.
 
1650 ప్రాంతములో ముష్టిపల్లి వీరారెడ్డి [[అయిజా]], [[దరూరు]] మొదలైన మహళ్లకు [[నాడగౌడు]]గా ఉండేవాడు. వీరారెడ్డికి మగ సంతానము లేకపోయడము వలన తన ఏకైక కుమార్తెకు వివాహము చేసి అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికము తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తరువాత అల్లుడు పెద్దారెడ్డి నాడగౌడు అయినాడు. పెద్దారెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆనందగిరి, చిన్నవాడు సోమగిరి (ఈయననే సోమానాధ్రి, సోమన్నభూపాలుడని ప్రసిద్ధుడయ్యాడు). పెద్దారెడ్డి తరువాత ఆయన రెండవ కొడుకు సోమన్న [[1704]] నుండి నాడగౌడికము చేశాడు. ఈయనే కృష్ణా నది తీరాన గద్వాల కోట నిర్మించి తుంగభద్రకు దక్షిణమున రాజ్యాన్ని [[బనగానపల్లె]], [[ఆదోని]], [[సిరివెళ్ల]], [[నంద్యాల]], [[సిద్ధాపురం]], [[ఆత్మకూరు, కర్నూలు జిల్లా|ఆత్మకూరు]], [[అహోబిళం]], [[కర్నూలు]] మొదలైన ప్రాంతాలకు విస్తరింపజేశాడు. ఈ సంస్థానము కింద 103 పెద్ద గ్రామాలు, 26 జాగీరులు ఉండేవి.
 
[[నిజాం]] అలీ ఖాన్ అసఫ్ ఝా II యొక్క పరిపాలనా కాలములో, దక్కనులోని కొన్ని ప్రాంతములలో మరాఠుల ప్రాబల్యము పెరిగి 25 శాతము ఆదాయ పన్ను (''చౌత్'') వసూలు చేయడము ప్రారంభించారు. దీనిని ''దో-అమలీ'' (రెండు ప్రభుత్వాలు) అని కూడా అనేవారు. రాజా సీతారాం భూపాల్ [[1840]] లో మరణించాడు. ఆ తరువాత ఆయన దత్తపుత్రుడు రాజా సీతారాం భూపాల్ II సంస్థానమును పరిపాలించాడు. నిజాము VII ఈయనకు "మహారాజ" అనే పట్టమును ప్రధానము చేశాడు. [[1924]] లో మరణించే సమయానికి ఈయనకు భార్య మరియు ఇద్దరు కుమార్తెలు కలరు.
 
గద్వాల సంస్థానాధీశులు తమ స్వంత నాణేలను ముద్రించుకున్నారు కూడా. 1909 నాటికి కూడా ఈ నాణేలు రాయిచూరు ప్రాంతంలో చలామణీలో ఉండేవి. <ref>ImprialGazetterOfIndiaHyderabad పుస్తకం నుండి. ఇంపీరియల్ గజెట్లను [http://www.archive.org/search.php?query=collection%3Amillionbooks%20AND%20language%3AEnglish%20AND%20imperial మిలియన్ బుక్స్] సైటు నుండి దిగుమతి చేసుకోవచ్చు</ref>
==గద్వాల సంస్థానమును పాలించిన రాజులు==
బుడ్డారెడ్డి గద్వాల సంస్థానమునకు మూలపురుషుడు.<ref>సంగ్రహ ఆంధ్రవిజ్ఞాన కోశము-3, 1962 ప్రచురణ, పేజీ 304</ref> మొత్తం 11 రాజులు, 9 రాణులు ఈ సంస్థానాన్ని పాలించారు. వీరిలో ముఖ్యులు.
"https://te.wikipedia.org/wiki/గద్వాల_సంస్థానం" నుండి వెలికితీశారు